దేశవ్యాప్తంగా స్మార్ట్ లాక్‌డౌన్ ప్రకటింపు..రాత్రి 8కే షాపులు క్లోజ్..ఎక్కడంటే!

ఇంధన కొరత పెరగడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ‘స్మార్ట్ లాక్‌డౌన్’ అమలు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా విద్యుత్.. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకున్నారు.;

Update: 2026-04-07 09:32 GMT

Lockdown 2026: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ పరిస్థితులు అనేక దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. హార్ముజ్ జలసంధి మార్గంలో నౌకల రవాణా ఆగిపోవడంతో చమురు సరఫరా సమస్యలు తలెత్తాయి. ఈ ప్రభావం పాకిస్తాన్‌లో తీవ్రంగా కనిపిస్తోంది.

ఇంధన కొరత పెరగడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ‘స్మార్ట్ లాక్‌డౌన్’ అమలు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా విద్యుత్.. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ స్మార్ట్ లాక్‌డౌన్ ప్రకారం దేశంలోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, కమర్షియల్ సెంటర్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి. పంజాబ్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, బలోచిస్తాన్, ఇస్లామాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ నిబంధనలు అమలు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాత్రి 9 గంటల వరకు కొంత సడలింపు ఇచ్చారు.

ఇక హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు కూడా రాత్రి 10 గంటలకే మూసివేయాలి. పెళ్లి వేడుకలు, ఈవెంట్లు కూడా 10 గంటల తర్వాత నిర్వహించరాదు అని ప్రభుత్వం ఆదేశించింది. ఇళ్లలో కూడా పెద్దగా వేడుకలు జరపకుండా పరిమితులు విధించారు. ప్రజలు అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని కూడా సూచించారు.

అయితే అత్యవసర సేవలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు విధించలేదు. మెడికల్ షాపులు, ఆసుపత్రులు సాధారణంగా కొనసాగుతాయి. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.

ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా తీసుకుంది. కొన్ని నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఒక నెలపాటు ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ఇంధన కొరత కారణంగా వ్యాపారాలు, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News