మదనపల్లె‌లో దుశ్శాసన పర్వం.. బాలిక శీలానికి వెలకట్టిన నీచుడు..!

Update: 2020-11-27 08:50 GMT
‘గాంధీ పుట్టిన దేశంలో గజానికో గాంధారి పుత్రుడు’ ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర్​ తిలక్​ చాలా ఏళ్ల  క్రితం అన్న మాటలివి. ప్రస్తుతం మనదేశంలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.  స్త్రీలు, బాలికలపై లైంగికదాడులు నిత్యకృత్యంగా మారిపోయాయి. లైంగికదాడి జరగని రోజంటూ ఉండటం లేదు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా పదులసంఖ్యలో రేప్​కేసులు నమోదవుతున్నాయి. పోలీసుల దృష్టికి రాకుండా నాలుగు గోడల మధ్య జరుగుతున్న ఘటనలు కూడా కోకొల్లలు. తాజాగా ఆంధ్రప్రదేశ్​లోని మదనపల్లెలో ఇటువంటి దారుణమే జరిగింది. తల్లిదండ్రులు లేని మైనర్​ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన ఓ దుర్మార్గుడు ఆమెను రెండ్రోజులపాటు వివిధ ప్రాంతాల్లో తిప్పి చివరకు బస్టాండ్ ​లో విడిచిపెట్టాడు.

ఇదేమిటని ప్రశ్నిస్తే శీలానికి వెల కట్టాడు. ఎంత ఇస్తే కేసును విత్​డ్రా చేసుకుంటారంటూ బంధువులతో బేరసారాలకు దిగాడు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే దీనికో రాజకీయనాయకుడు మధ్యవర్తిగా వ్యవహరించాడు.  మదనపల్లెలోని శివాజీనగర్‌కు చెందిన ఓ బాలిక (15) కు తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో ఆమె తమ బంధువుల వద్ద ఉంటున్నది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన హరీశ్​ (30) బాలికకు దగ్గరయ్యాడు. తరుచూ ఆమెను కలుస్తూ ఉండేవాడు. ఈ నెల 20న బాలికను తన వెంట తీసుకెళ్లాడు. అయితే అదేరోజు బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హరీశ్​.. బాలికను తీసుకొని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఇటీవల మదనపల్లె  బస్టాండ్​ వద్ద ఆమెను వదిలేశాడు. అయితే ఇంటికి చేరిన బాలిక పోలీసులకు విషయం చెప్పింది.  దీంతో బాలిక బంధువులు, సోదరి టూటౌన్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న హరీశ్​ మిత్రుడు.. ఓ పార్టీ నేత బాలిక బంధువులతో బేరసారాలు కొనసాగించాడు. కేసు విరమించుకొనేందుకు ఎంత కావాలంటూ వాళ్లను ప్రలోభపెట్టాడు. కానీ వాళ్లు అందుకు అంగీకరించడపోవడంతో హరీశ్​ అతడి స్నేహితులు బాలిక బంధువులపై దాడి చేశారు ఈ దాడిలో పెద్ద రెడ్డెమ్మ(30), చిన్న రెడ్డెమ్మ(21) గాయపడ్డారు. దీంతో వాళ్లు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News