చోరీకి వచ్చి.. గన్ గురి పెట్టి చేసిన పనితో అవాక్కు

Update: 2019-10-19 07:03 GMT
దొంగతనానికి వచ్చినోళ్లు ఏం చేస్తారు? అందినకాడికి దోచుకుంటారు. అడ్డు వచ్చిన వారిని ఏం చేసేందుకైనా వెనుకాడరు. అక్కడ లక్ష్యం తాము అనుకున్నట్లుగా దొంగతనాన్ని విజయవంతంగా పూర్తి చేయటమే వారి ఫోకస్ ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరించిన వైనం ఇప్పుడు సంచలనంగానే కాదు.. సదరు సీసీ కెమేరా పుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంతకూ జరిగిందేమంటే..  బ్రెజిల్ లోని ఒక మందుల షాపులోకి  ప్రవేశించారు ఇద్దరు దుండగులు. ఆ సమయంలో షాపులో యజమాని.. మరోపెద్దావిడ మాత్రమే ఉన్నారు. తుపాకులు చేతపట్టి స్టోర్ లోపలకు వచ్చిన ఇద్దరు దొంగలు.. వారికి గురి పెట్టి.. అందిన కాడిని డబ్బులు దోచే పనిలో పడ్డారు. యజమానిని బెదిరిస్తూ క్యాష్ కౌంటర్ నుంచి డబ్బులు లాగేసే ప్రయత్నంలో ఉండగా.. అక్కడున్న పెద్దావిడ ఆందోళనకు గురైంది.

మరో దొంగ ఆమెకు సమీపంలో రెండు చేతులతో రెండు తుపాకులు పట్టుకొని బెదిరిస్తున్నాడు. ఈ సమయంలో భయపడిన ఆమె.. తన దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా తీసుకోవాలని కోరింది. ఆమె పడుతున్న టెన్షన్ చూసి ఏమనుకున్నాడో కానీ మరో దొంగ మాత్రం చప్పున ఆ పెద్దావిడ నుదిటి మీద ముద్దు పెట్టుకొని డబ్బులు అక్కర్లేదని చెప్పేయటం విశేషం. మరో దొంగ మాత్రం కొన్ని మందుల్ని.. క్యాష్ కౌంటర్లో ఉన్న 240 డాలర్లను తీసుకొని షాపు నుంచి పరారయ్యారు. షాపు సీసీ కెమేరా ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. చోరీకి వచ్చి ఇస్తామన్న డబ్బుల్ని వద్దని చెబుతూ.. నుదిటి మీద ముద్దు పెట్టిన వైనం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Full View
Tags:    

Similar News