సికింద్రాబాద్ లో షాక్.. పబ్జీ ఆడుతుంటే తల్లి తిట్టిందని.. ఉరేసుకున్నాడు

Update: 2020-08-16 06:30 GMT
తప్పు చేస్తుంటే మందలించటం.. బుద్ది చెప్పటం కూడా ఈ తరానికి తప్పైపోతుందా? అన్న సందేహం కలిగేలా ఈ ఉదంతం ఉందని చెప్పాలి. తాజాగా సికింద్రాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాదం షాకింగ్ గా మారింది. తప్పు చేసే పిల్లల్ని తల్లిదండ్రులు మందలిస్తుంటారు. అలాంటి మందలింపుకు తీవ్ర నిర్ణయాలు తీసుకున్న వైనం అవాక్కు అయ్యేలా చేస్తుంది. పద్నాలుగేళ్ల బాలుడు సూసైడ్ చేసుకున్న వైనం చర్చనీయాంశంగా చెప్పక తప్పదు.

కరోనా నేపథ్యంలో పిల్లలు.. తల్లిదండ్రులు ఇళ్లకే పరిమితయ్యారు. నెలల తరబడి ఇంట్లోనే ఉంటున్న వారు.. అందుబాటులో ఉన్న తల్లిదండ్రుల ఫోన్లలో గేములు ఆడుకోవటం.. మరికొందరు ట్యాబులు.. ల్యాప్ టాప్ లతో ఆడేస్తున్నారు. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ కు చెందిన పద్నాలుగేళ్ల బాలుడికి పబ్జీ అంటే ప్రాణం.ఏ మాత్రం టైం దొరికినా చాలు.. తల్లి ఫోన్ తీసుకొని పబ్జీ ఆడేస్తుంటాడు.

ఈ విషయంపై తాజాగా ఆ బాలుడ్ని తల్లి చీవాట్లు పెట్టింది. దీంతో తీవ్రమైన మనస్తాపానికి గురైన ఆ బాలుడు.. ఇంట్లో ఎవరు లేని టైం చూసుకొని.. ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వైనం తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. ఒక ఆన్ లైన్ గేమ్ కోసం నిండు ప్రాణాన్ని తీసుకున్న వైనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఏమైనా తల్లి మందలిస్తే మాత్రం.. ప్రాణాలు తీసేసుకుంటారా? అన్న ప్రశ్న పలువురిని వేధిస్తోంది.
Tags:    

Similar News