ష‌ర్మిల సెల్ఫీతో ఒక ఫ్రేమ్ లో జ‌గ‌న్ ఫ్యామిలీ!

Update: 2019-05-31 06:55 GMT
అరుదైన ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే.. ఈ క్రెడిట్ మొత్తంజ‌గ‌న‌న్న వ‌దిలిన బాణం ష‌ర్మిల‌దేన‌ని చెప్పాలి. ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ సంద‌ర్భంగా జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులంతా క‌లిసి ఒక ఫోటో దిగారు. అయితే.. ఈ ఫోటోను జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల సెల్ఫీగా తీశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ లేని రీతిలో ఈ ఫోటోలో జ‌గ‌న్.. ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి.. త‌ల్లి విజ‌య‌మ్మ‌ల‌తో పాటు.. ష‌ర్మిల‌.. ఆమె భ‌ర్త ఉన్నారు. ఈ పిక్ లో విశేషం ఏమంటే.. ఎవ‌రి పిల్ల‌లు లేకుండా ఉండ‌టం. మ‌రోఆస‌క్తిక‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. ముచ్చ‌టైన కుటుంబానికి ప్ర‌తిరూపంలా ఈ ఫోటో నిలుస్తుంద‌ని చెప్పాలి.

జ‌గ‌న్ కు ఒక‌వైపు సోద‌రి ష‌ర్మిల ఉంటే.. మ‌రోవైపు జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి నిలిచారు. వీరి వెనుక బ్ర‌ద‌ర్ అనిల్.. విజ‌య‌మ్మ‌లు ఉన్నారు. ప‌ర్ ఫెక్ట్ సెల్పీకి నిద‌ర్శ‌నంగా ఈ పిక్ చెప్పాలి. అంతేకాదు.. ఈ పిక్ తో మ‌రో కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లే. ప్ర‌త్య‌ర్థులపై నిప్పులు కురిపించేలా మాట్లాడే షర్మిల‌లో సెల్ఫీల ప్రావీణ్యం ఎంత ఉంద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సెల్ఫీ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News