పుజారాపై జాతివివక్ష.. షేన్ ​వార్న్ ​పై భారతీయుల ఆగ్రహం..!

Update: 2020-12-18 09:30 GMT
టీం ఇండియా టెస్ట్​ప్లేయర్​ పుజారాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ షేన్​వార్న్​ జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. షేన్​వార్న్​ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ క్రికెట్​ అభిమానులు, భారతీయులు డిమాండ్​ చేస్తున్నారు.  గురువారం జరిగిన మ్యాచ్​లో పుజారా ఓ ప్రొఫెషనల్​ టెస్ట్​ ప్లేయర్​లా ఆడాడు.  147 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. అయితే టెస్టు క్రికెట్​లో ఎన్నిపరుగులు చేశామన్నదానికంటే.. ఎంతసేపు వికెట్​ పడకుండా ఆపామన్నదే ముఖ్యం. ఆ లెక్కన చూసుకుంటే పుజారా ‘జిడ్డు’ గా ఆడాడు.

 భారతమాజీ క్రికెటర్లు ద్రవిడ్​, గవాస్కర్​ లను తలపించేలా డిఫెన్స్​ ఆడాడు.  ఎంతకూ అవుట్​ కాకుండా ఆస్ట్రేలియా బౌలర్ల కు  చుక్కలు చూపించాడు. ఇండియాకు మరో ద్రవిడ్​ వచ్చేశాడంటూ సోషల్​ మీడియా లో పొగడ్తలు  మొదలయ్యాయి. పుజారా 148వ బంతికి బౌండరీ కొట్టాడు. మొత్తం 160 బంతులు ఆడి 43 పరుగులు చేశాడు. పుజారా ఆట తీరుకు ప్రశంసలు దక్కాయి. అయితే పుజారా బ్యాటింగ్​ చేస్తున్న సమయం లో కామెంటేటర్​ గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ  క్రికెటర్​ షేన్​ వార్న్​ వాడిన ఓ పదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నది. అతడు ఏమన్నాడంటే..  ‘చతేశ్వర పుజారా  పేరు పలకడం ఇంగ్లీష్​ వాళ్లకు  చాలా కష్టం అందుకే అతడిని ‘స్టీవ్​’ అని పిలిచేవాళ్లు’ అంటూ షేన్​ వార్న్​ వ్యాఖ్యానించాడు.  

అయితే అతడు వాడిన ‘స్టీవ్’ అనే పదం వర్ణవివక్షను సూచిస్తుందంటున్నారు భాషా  నిపుణులు. తెల్లజాతి వాళ్లు.. ఇతర జాతులకు చెందిన పనివాళ్లను స్టీవ్​ అని పిలుస్తారట. ఆసియా ఖండం నుంచి వచ్చి యూరప్​, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో స్థిరపడ్డ పనివాళ్లను (రెస్టారెంట్లలో వంట చేసే చెఫ్​లను, ఇతర పనులు చేసే వాళ్లను) స్టీవ్​ అని పిలుస్తుంటారట. అయితే ఇప్పుడు ఓ ప్రొఫెషనల్​ క్రికెటర్​ను ఆ పేరుతో పిలవడం ఎంతో అవమానకరమని భారతీయులు అంటున్నారు.  షేన్​వార్న్​ వెంటనే సారీ చెప్పాలని  డిమాండ్​ చేస్తున్నారు. ​
Tags:    

Similar News