ఆ జిల్లాను షాడో ఎమ్మెల్యేలు కుదిపేస్తున్నారా..?

Update: 2021-12-14 00:30 GMT
ప్ర‌స్తుతం రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు.. తమ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో దూరంగా ఉంటూ.. ప‌నులు మాత్రం త‌మ పేరిట త‌మ వారితో చేయించేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వాస్త‌వానికి గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారం నుంచి దిగిపోవ‌డానికి ఇలాంటి ప‌రిస్థితి కూడా కార‌ణ‌మైంది.

ఈ నేప థ్యంలో వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్‌.. ఇలాంటి ప‌రిణామాల‌ను సీరియ‌స్‌గానే తీసుకుంటున్నారు. ఎందు కంటే.. పార్టీ అనేక సంక్షేమ ప‌థ‌కాలు చేప‌డుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేల పాత్ర కూడా ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా ప‌నిచేస్తుంది. అయితే.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల బ‌దులు షాడో ఎమ్మెల్యేల పాత్ర ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని దాదాపు 5 నియోజ‌క‌వ‌ర్గాల్లో షాడో ఎమ్మెల్యేలే హ‌వా చ‌లాయిస్తున్నార‌ని పెద్ద ఎత్తున టాక్ న‌డుస్తోంది. దీనిలో రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న ఒక కీల‌క నేత కూడా ఉన్నార‌ని అంటున్నారు.

కేవ‌లం ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు.. సంత‌కాలు చేయ‌డానికి.. మాత్ర‌మే ఉన్నార‌ని.. ప‌నులు మాత్రం వారి పేరుతో వారి బంధువులు, కుమారులు.. అల్లుళ్లు చేసేస్తున్నార‌ని.. అంటున్నారు. అంతేకాదు.. ప‌ని కావాలంటే.. వీరి ద‌గ్గ‌ర‌కే స‌ద‌రు ఎమ్మెల్యేలు కూడా పంపేస్తున్నార‌ని అంటున్నారు.

ఈ విష‌యంలో ఎవ‌రైనా.. స‌ద‌రు ఎమ్మెల్యేల‌ను ఇదేంటి సార్ అని ప్ర‌శ్నిస్తే.. నేను వేరే ప‌నుల్లో బిజీగా ఉన్నాన‌ని చెప్ప‌డ‌మో.. లేక‌.. మా వాళ్ల‌కు కూడా ఎలా ప‌నిచేయాలో తెలియాలిక‌దా.. అనుభ‌వం రావాలి క‌దా..అనే మాట‌లు చెబుతున్నార‌ట‌.

ఎచ్చెర్ల‌లో అయితే.. ఏకంగా.. ఎమ్మెల్యే బ‌దులు ఆయ‌న మేన‌ల్లుడే.. చ‌క్రం తిప్పేస్తున్నార‌ని స్థానికులు బాహాటంగానే చెబుతున్నారు. అదేవిధంగా ప‌లాస‌లో ఏకంగా.. మంత్రి గారి స్థానంలో సొంత మ‌నుషులు.. చ‌క్రాలు తిప్పుతున్నార‌ట‌.

ఆముదాల‌వ‌ల‌స‌లో స్పీక‌ర్ గారి కుమారు డు,.. ఇలా.. మొత్తం 5 నియోజ‌క‌వ‌ర్గాల్లో షాడో ఎమ్మెల్యేలు తెర‌మీద‌కి రావ‌డం.. అన్నీ చ‌క్క‌బెట్ట‌డం.. అధికారులు కూడా వారి చుట్టూనే తిర‌గ‌డం.. వంటివి ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. మ‌రి ఇదే కంటిన్యూ అవుతుందో.. ప‌రిస్థితి మారుతుందో చూడాలి.


Tags:    

Similar News