బీర్ తాగితే.. శృంగారంలో రెచ్చిపోతారా? ఎక్కువగా తాగితే ఏమౌతుంది

Update: 2021-09-22 23:30 GMT
మద్యం ఆరోగ్యానికి మంచిదా ? అదేంటి మద్యం ఆరోగ్యానికి హానికరం అని అంటారు కదా అంటే ఆల్కహాల్ తాగడం అనారోగ్యకరమైనది అనే భావన ఉంది. అయితే మద్యం తాగినప్పుడు పెద్దవారు పొందే ఆనందాన్ని మరచిపోలేము. అనేక దీనిని డిప్రెషన్, వారాంతపు వేడుకలకు నివారణగా కోరుకుంటారు. ఒక్క మద్యం సేవించడానికి మాత్రమే ఒక్క సందర్భం అవసరం లేదు. శుభకార్యాలు అయినా, బర్త్ డే పార్టీ అయినా, ఫ్రెండ్ బాధలో ఉన్నా, అదే ఫ్రెండ్ సంతోషంలో ఉన్నా మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. ఒక పుట్టిన రోజైనా , చచ్చిన రోజైనా కూడా మందు ఖచ్చితంగా ఉండాల్సిందే. '

మీకు ఇష్టమైన అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలు, ఆల్కహాల్ తక్కువ కేలరీలు ఉంటాయి. అయితే డైట్ చేసేవారు దీనికి దూరంగా ఉండాలి. మద్య సేవించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా ఆల్కహాల్ మన ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ సరైన రీతిలో, తాగడం వల్ల మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఎక్కువగా యువకులు బీర్ ను తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ బీర్ తాగడం వలన ఆరోగ్యానికి మంచి జరుగుతుందని ప్రచారంలో ఉన్నప్పటికీ తెలుస్తున్న సమాచారం ప్రకారం బీర్ తాగడం వలన పురుషులకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

బీర్ ఏదో కొంచెం పరిమితంగా తీసుకుంటే ఓకె గానీ, అపరిమితంగా తీసుకుంటే మాత్రం నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం శృంగారంలో పాల్గొనే ముందు కొంత మంది మహిళలకు మరియు పురుషులకు బీర్ ను ఇచ్చారట. అయితే బీర్ తీసుకున్న తర్వాత మహిళలలో ఎటువంటి ఎఫెక్ట్ లేదని వీరు గమనించినట్లు తెలిసింది. అదే పురుషులలో మాత్రం బీర్ తాగిన తర్వాత శృంగార సామర్థ్యం పెరిగిందని ఈ అధ్యయనం తెలిపింది. అంతే కాకుండా నపుంసకులు బీర్ తీసుకుంటే ఆ ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని వీరు చెబుతున్నారు.

అయితే ఇక్కడ ఒక సంకటం ఏర్పడే ప్రమాదం ఉందని వీరు చెబుతున్నారు. నపుంసకత్వం సమస్య పూర్తిగా తొలగిపోవాలని ఎక్కువగా బీర్లు తాగితే మాత్రం అంగం స్థంభన సమస్య వచ్చే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం తెలుపుతోంది. కాబట్టి బీర్ ను చాలా పరిమితంగా మాత్రమే సేవించాలని చెబుతున్నారు. కాబట్టి యువకులు అందరూ ఆలోచించి బీర్ ను తక్కువగా మాత్రమే తాగండి. వీలైతే మానేయండి. మద్యం తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు.

ఈ అధ్యయనంలోని విషయాలను పరిశోధకులు కూడా అంగీకరించారు. పింట్ బీరులో సగం తాగినా సరే పురుషత్వానికి ఎలాంటి సమస్య ఉండదని, ముప్పు 26 శాతానికి తగ్గుతుందని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ మరో ప్రతికూల అంశాన్ని కూడా తెలుసుకోవాలి. బీర్, వైన్ తాగితే నపుంసకత్వం రాదనే ఉద్దేశంతో అతిగా తాగేస్తే.. మొదటికే మోసం వస్తుంది. అతిగా మద్యం తాగితే అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి.. పైన పేర్కొన్న లెక్క ప్రకారమే తీసుకుని ఆరోగ్యంగా ఉండండి. బెస్ట్ పార్టనర్‌గా మంచి మార్కులు కొట్టేయండి.


Tags:    

Similar News