వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూడా లైంగిక వేధింపులు .. ఎలా అంటే
ఆఫీసుల్లో కానీ, లేదా ఎక్కడైనా పని చేసే ప్రదేశంలో లైంగిక వేధింపులు ఉన్నాయనే దానిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఈ ఫిర్యాదులు బాగా తగ్గిపోయాయి. అయితే రిమోట్ వర్క్ స్పేస్ లోనూ లైంగిక వేధింపులు ఆగట్లేదని ఎంప్లాయిస్ కొందరు వాపోతున్నారు. యాంటీ-సెక్సువల్ హరాస్ మెంట్ అడ్వైజరీ ‘కంప్లైకరో డాట్ కామ్’ ఈ ఏడాదికి నిర్వహించిన సర్వేలో వార్షిక నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది.
భారత్ లో ఉన్న టాప్ 44 కంపెనీలలో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న ఎంప్లాయిస్ నుంచి లైంగిక వేధింపులపై ఫిర్యాదులు సేకరించింది కంప్లైకరో డాట్ కామ్. కిందటి ఏడాదితో పోలిస్తే తక్కువ ఫిర్యాదులు రాగా.. లైంగిక వేధింపుల కేసుల శాతం 38.26 శాతానికి పడిపోయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఇది గత రెండేళ్లతో పోలిస్తే చాలా తక్కువ. అయితే రిమోట్ వర్క్ లోనూ ఎంప్లాయిస్ తాము ఎదుర్కొంటున్న వేధింపులను చర్చకు తీసుకువచ్చారు. సెక్సువల్ హరాస్ మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ యాక్ట్ 2013 ప్రకారం, ప్రతీ ఏడాది లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా లైంగిక వేధింపుల ఫిర్యాదుల్ని నమోదు చేయడం, వాటి కట్టడికి తీసుకుంటున్న చర్యల గురించి ప్రభుత్వాలకు నివేదికల్ని సమర్పించాల్సిందే.
సర్వేలోనే సుమారు ఐదు వందల దాకా ఫిర్యాదు అందాయి. ఇవిగాక కొందరు సర్వే పోర్టల్ కు పర్సనల్ మేసేజ్‌ల ద్వారా, మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభద్రత భావాన్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలో కొలీగ్స్, టీమ్ మేట్స్, టీమ్ లీడ్స్ తో పాటు మేనేజర్, బాస్ స్థాయి వ్యక్తులపై సైతం ఫిర్యాదులు రావడం విశేషం. విపరీతమైన వర్క్ టాస్క్ లు ఇస్తున్నారని, అవి తప్పించాలంటే తమతో సన్నిహితంగా ఉండాలంటూ ఒత్తిడి చేస్తున్నారని కొందరు వాపోయారు. ఇంకొందరు వేళకానీ వేళలో ఆన్ లైన్ కి, వీడియో కాల్స్ కి రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, అనవసరమైన వ్యక్తిగత చర్చలతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఇదంతా తమ మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపెడుతోందని వాపోయారు వాళ్లు. దీనిపై ప్రస్తుతం విపరీతంగా చర్చ జరుగుతుంది.
కరోనా కారణంగా.. వర్క్ ఫ్రమ్ హోంకి ఎంప్లాయిస్‌కు అనుమతిస్తున్న కంపెనీల్లో చాలావరకు హైక్‌ల సంగతి పక్కనపెట్టి, ఉద్యోగాల విషయంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి ఎంప్లాయిస్‌తో పని చేయించుకుంటున్నాయి. టార్గెట్‌లను ఫినిష్ చేయడానికి సాధారణ పని గంటల కంటే అదనంగా (మరో నాలుగైదు గంటలు) పని చేయాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు కూడా. అయినప్పటికీ వైరస్ భయం, ఇతరత్ర కారణాలతో వర్క్ ఫ్రమ్ హోంకే మొగ్గు చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఆఫీస్ స్పేస్‌లలో వేధింపులు తగ్గినప్పటికీ.. వర్క్‌ఫ్రమ్ హోంలోనూ వర్చువల్ మీటింగ్‌ల పేరుతో కొందరు ఉద్యోగిణులు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల్ని ఈ సర్వేలో ప్రస్తావనకు తెచ్చారు.
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోంకి ఎంప్లాయిస్ కు అనుమతిస్తున్న కంపెనీల్లో చాలావరకు హైక్ ల సంగతి పక్కనపెట్టి, ఉద్యోగాల విషయంలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేసి ఎంప్లాయిస్ తో పని చేయించుకుంటున్నాయి. టార్గెట్ లను ఫినిష్ చేయడానికి సాధారణ పని గంటల కంటే అదనంగా పని చేయాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు కూడా. అయినప్పటికీ వైరస్ భయం, ఇతరత్ర కారణాలతో వర్క్ ఫ్రమ్ హోంకే మొగ్గు చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఆఫీస్ స్పేస్‌లలో వేధింపులు తగ్గినప్పటికీ.. వర్క్ ఫ్రమ్ హోంలోనూ వర్చువల్ మీటింగ్ ల పేరుతో కొందరు ఉద్యోగిణులు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల్ని ఈ సర్వేలో ప్రస్తావనకు తెచ్చారు.