సెక్స్ రాకెట్: ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులే టార్గెట్
సమాజంలో పేరు, ప్రతిష్టలు ఉన్న వారే వారి టార్గెట్. వారిని అమ్మాయిలతో వలవేస్తారు. వారితో ఎంజాయ్ చేపిస్తారు. చివరకు బజారుకీడుస్తామని డబ్బులు వసూలు చేస్తారు. ఈ హనీ ట్రాప్ దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు చోట్ల జరగగా.. తాజాగా ముంబై పోలీసులు ఓ భారీ ముఠాను పట్టుకున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు లక్ష్యంగా చేసుకొని వారిని స్త్రీలోలురుగా అపఖ్యాతి చేసేందుకు ప్రయత్నం చేసే ముఠాను తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలతో వలవేసి లోబరుచుకునేలా చేసి వారి వద్ద నుంచి ఈ ముఠా లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.పోలీసులు అరెస్ట్ చేసిన ఈ ముఠాలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గురిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ముఠా నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులకు వలవేస్తుంది. వాట్సాప్ తో వీడియో కాల్స్ చేసి నగ్నంగా చూపించి అట్రాక్ట్ చేస్తారు. ఆ టైంలో వారి వీడియోలను రికార్డ్ చేసి ఎడిట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు.ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ గ్యాంగ్ ఇప్పటిదాకా 171 నకిలీ ఫేస్ బుక్ ఖాతాలతో చాలా మందిని మోసం చేసినట్టు గుర్తించారు. 58 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు.