బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు

Update: 2020-09-30 11:10 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఉత్కంఠ రేపిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు బాబ్రీ మసీదు కూల్చిన 28 ఏళ్లకు ఈ చారిత్రక తీర్పు వెలువడడం విశేషం.

ఈ బాబ్రీ మసీదు కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న బీజేపీ కురువృద్ధులు ఎల్ కే అద్వానీ - లోక్ సభ మాజీ స్పీకర్ మురళీ మనోహర్ జోషి - కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతిలపై నమోదైన కేసును సీబీఐ ప్రత్యక కోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.  ఈ మేరకు తుదితీర్పును కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు.

బాబ్రీ మసీదు కేసులో అద్వానీ - జోషి - ఉమాభారతి తోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్ధోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది.

విచారణలో మొత్తం 351మంది సాక్షులను సీబీఐ విచారించింది. ఈ కేసులో మొత్తం 49మంది నిందితులు ఆరోపణలు ఎదుర్కొగా..  విచారణలో ఉండగానే 17మంది మరణించారు. 28 ఏళ్ల సెప్టెంబర్ 30న ఈ తీర్పు వెలువడింది.

బాబ్రీ మసీదు కూల్చివేత ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రీప్లాన్డ్ ప్రకారం కాదని సీబీఐ న్యాయస్థానం తేల్చి ఈ మేరకు అద్వానీ సహా అందరినీ నిర్ధోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
Tags:    

Similar News