ఎమ్మెల్సీ పదవికి డొక్కా అందుకే రాజీనామా చేశారట

Update: 2020-01-30 07:33 GMT
కొందరు ఇనుము పట్టుకున్నా బంగారమవుతుంది. మరికొందరు బంగారం పట్టుకున్నా పనికి రాని ప్లాస్టిక్ అవుతుందే కానీ.. ఇనుము కూడా కాకుండా పోతుంది. ఈ పోలిక టీడీపీ అధినేత చంద్రబాబు కు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. నేత ఎవరైనా సరే టీడీపీ కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నంతనే వారి తీరే మారిపోతుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేకుండా.. భావ జాలంతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి నేతకు కండువా కప్పేసి.. సైకిల్ ఎక్కించటం ద్వారా తిరుగులేని బలం తమ సొంతమని ఫీలయ్యేవారు బాబు.

ఒక్కసారి పవర్ చేజారినంతనే.. చుట్టూ ఉన్న నేతలంతా చెల్లా చెదురు కావటం ఒక ఎత్తు అయితే.. డొక్కా మాణిక్య వరప్రసాద్ లాంటోళ్లు తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయటం విస్మయానికి గురి చేసింది. పదవిని ఎందుకు వదులుకున్నారంటే.. పార్టీ ఆలోచన.. తన వ్యక్తిగత ఆలోచన కు భిన్నంగా ఉన్నందునే ఎమ్మెల్సీ కి రాజీనామా చేసినట్లుగా వ్యాఖ్యానించారు.
మండలి రద్దు విషయం లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మండలి అన్నది ఒక వ్యవస్థ అని.. వ్యక్తుల మీద కక్ష తో రద్దు చేయటం మంచికాదన్నారు. అమరావతి రైతుల బాధల్ని తాను స్వయంగా చూశానని చెప్పిన డొక్కా.. వారికి తాను అండగా ఉంటానన్నారు. రానున్న రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. చెప్పేదేదో సూటిగా చెప్పటం మానేసి.. ఇప్పటికి ఈ డొంక తిరుగుడు మాటలేంది డొక్కా?


Tags:    

Similar News