అండర్‌వేర్ లో కరోనా సొమ్ము దాచిన సెనేటర్ .. అరెస్ట్ !
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు కూడా కరోనాను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాయి. అలా కరోనాపై పోరుకి కేటాయించిన నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కు కుడి భుజంగా చెప్పుకునే సెనేటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెనేటర్ చికో రోడ్రిగ్స్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
సెనేటర్ రోరైమాలోని రోడ్రిగ్స్ నివాసంలో బుధవారం సోదాలు నిర్వహించిన అధికారులు, అండర్ వేర్ లో దాచిపెట్టిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30వేల రియల్స్ (5,300 డాలర్లు) రోడ్రిగ్స్ అండర్ వేర్ లో గుర్తించారని బ్రెజిల్ మీడియా లో వెల్లడించింది. రోరైమా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేటాయించిన ప్రజా నిధులను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించామని చెప్పిన పోలీసులు, నగదు ఎక్కడ దొరికిందనే విషయం గురించి మాత్రం మాట్లాడలేదు.
ఇదిలా ఉంటే, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సెనేటర్ రోడ్రిగ్స్ ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఓ సెనేటర్ గా ఉన్న తన నివాసంలో అక్రమంగా సోదాలు నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మీడియా సృష్టిగా బ్రెజిల్ అధ్యక్షుడు ఆరోపణలు గుప్పించాడు. ప్రభుత్వంపై అవినీతి ముద్రవేయడానికే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అవినీతికి పాల్పడినా సహించబోమని, తమ ప్రభుత్వంలో అవినీతి లేదనడానికి ఈ ఆపరేషన్ ఓ ఉదాహరణ అని తెలిపారు. అవినీతిపై పోరాటం చేస్తామనే వాగ్దానంతో 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన , ఆ దిశగా చర్యలు తీసుకోవడం విఫలమయ్యారు. అధ్యక్షుడి సహా ఆయన కుటుంబంపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.