ఏలూరు అంతుచిక్కని వ్యాధి వెనుక అసలు రహస్యం అదేనట
ఏదో చేయబోతే మరేదో అయినట్లుగా ఉంది ఏలూరులోని అంతుచిక్కని వ్యాధి వ్యవహారం. గత శనివారం నుంచి ఏలూరు ప్రజలకు.. ఏపీ ప్రభుత్వానికి కంటి నిండా నిద్ర లేకుండా చేసిన ఈ సమస్యకు సంబంధించి కీలక అంశాల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు 550 మందిని ప్రభావితం చేసిన ఈ వ్యాధి వెనుక సీక్రెట్ ను తాజాగా ఛేదించినట్ులగా చెబుతున్నారు.
కరోనా వ్యాపించకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలు.. చివరకు మరో మలుపు తిరిగి కొత్త సమస్యకు కారణమని తేల్చారు. కోవిడ్ 19 పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా బ్లీచింగ్.. క్లోరిన్ ను పెద్ద ఎత్తున వినియోగించారు. దీంతో.. నీటి కాలుష్యం సంభవించి కొత్త తిప్పలు చోటు చేసుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. కొత్తఅనారోగ్యానికి కారణం నీటి కాలుష్యం ఒకటన్న విషయాన్ని మంత్రి ఆళ్ల నాని సైతం పేర్కొనటం గమనార్హం.
మంత్రి నాని చెప్పినట్లే.. నీటి కాలుష్యానికి అసలు కారణం ఏమిటన్న అంశంపై ప్రభుత్వం ఫోకస్ చేయాలని పలు పరిశోధన సంస్థలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎయిమ్స్ న్యూఢిల్లీ.. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్.. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులిర్ బయాలనీ.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలు సైతం నీటి కాలుష్యం మూలాల్ని పరిశీలిస్తే.. ఏలూరు అంతుచిక్కని వ్యాధికి అసలు కారణం తెలిసిపోతుందని చెబుతున్నారు.