రష్యా కరోనా వ్యాక్సిన్ సమర్థమైనదేనా..పలు అనుమానాలు లేవనెత్తిన శాస్త్రవేత్తలు

Update: 2020-08-12 07:10 GMT
కరోనా  కోరల్లో చిక్కుకొని ప్రపంచంలోని పలు దేశాలు  విలవిల్లాడుతున్నాయి. రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ పుట్టింది.  అది మహమ్మారి అని తెలిసినప్పటినుంచి కరోనా నిరోధక వ్యాక్సిన్ తయారీలో అన్ని దేశాలు తలమునకలై ఉన్నాయి. మొదటి వ్యాక్సిన్ ను తామే ముందు  మార్కెట్లోకి తెస్తామంటూ  పోటీపడుతున్నాయి. అన్ని దేశాలు ఇంకా వ్యాక్సిన్ తయారీ దశ,  క్లినికల్ ట్రయల్స్ దశలో ఉండగా రష్యా మాత్రం ఉన్నట్టుండి వ్యాక్సిన్  సిద్ధమైందంటూ  మంగళవారం దాన్ని ప్రారంభించింది. అయితే ఈ వ్యాక్సిన్  సమర్థతపై పలు దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలు  వ్యక్తం చేస్తున్నారు. రష్యా ఇంకా థర్డ్ పేజ్ ట్రయల్స్ కూడా నిర్వహించ లేదని, అయినా వ్యాక్సిన్ సిద్ధమైనట్లు ప్రకటించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

 సాధారణంగా ఏ వ్యాధికైనా ఒక వ్యాక్సిన్ సిద్ధం చేయాలంటే కనీసం 7 నుంచి పదేళ్ల సమయం పడుతుంది. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వేలాది కోట్లు వెచ్చించి టీకాను సత్వరం సిద్ధం చేసే పనిలో ఉన్నాయి. ముందు  టీకా సిద్ధం చేస్తే  కరోనాకు అడ్డుకట్ట వేయడంతో పాటు వ్యాక్సిన్ ఇతర దేశాలకు విక్రయిస్తే అది లాభసాటిగా ఉంటుందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. టీకా తయారైతే కొనుగోలు చేయడానికి పలు దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాల శాస్త్రవేత్తలు  టీకాను వృద్ధి చేయడానికి రేయింబవళ్ళు శ్రమిస్తున్నారు. విస్తృతంగా కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  రష్యా ఉన్నట్టుండి ' స్పుత్విక్ వి ' పేరుతో వ్యాక్సిన్ ను  విడుదల చేసింది. ఈ వ్యాక్సిన్ కొనుగోలుకు పలు దేశాలు భారీగా ఆర్డర్ కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల  శాస్త్రవేత్తలు రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తవకుండా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తేవడం ప్రమాదకరమని, ఒకవేళ   సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తితే, కరోనా మరింత ప్రమాదకారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

సురక్షితం కాని టీకాను  అందుబాటులోకి తేవడం సరికాదని అంటున్నారు. క్లినికల్ ట్రయల్స్ డేటా, సేఫ్టీ డేటాను అమెరికా యూరప్ సహా పలు దేశాలకు అందిస్తే గాని వ్యాక్సిన్ కి  లైసెన్స్ లభించదని పలువురు ఉన్నత వర్గాల అధికారులు  అంటున్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తమ దేశ శాస్త్రవేత్తలు సిద్ధం చేసిన వ్యాక్సిన్ మొదటి రెండు ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసిందని, మూడో క్లినికల్ ట్రయల్స్ లో స్వయానా తన కూతురికి కూడా వ్యాక్సిన్ వేయగా సరైన ఫలితం వచ్చినట్లు చెబుతున్నారు. తాము సిద్ధం చేసిన వ్యాక్సిన్ కచ్చితంగా కరోనా కు అడ్డుకట్ట వేస్తుందని ఆయన   ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News