జగన్ రెడ్డీ అని దీర్ఘాలు తీసినా... ?
అవును. జగన్మోహనరెడ్డి కాస్తా ముఖ్యమంత్రి అయ్యేసరికి జగన్ రెడ్డి అయిపోయారు. ఇది సినీ నటుడు కమ్ జనసేనాని పవన్ కళ్యాణ్ కనిపెట్టిన కొత్త పేరు. జగన్ రెడ్డీ అంటూ ఆయన ఓడిన కొత్తల్లో ప్రెస్ మీట్లలో పవన్ అలా దీర్ఘాలు తీసేవారు. దాని వెనక చాలా రాజకీయం ఉందని అంటారు. జగన్ రెడ్డి అని చెప్పడం, ఆయన ఒక వర్గం నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం. అయితే రాజకీయం అంతగా వంటబట్టని పవన్ ఈ పేరుని ఉపయోగించుకోవడంలో తడబడ్డారు. ఆ తరువాత ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయంగా జోరు తగ్గించేశారు. అయితే ఈ జగన్ రెడ్డీ అన్న దాన్ని మాత్రం టీడీపీ అంది పుచ్చుకుంది.
తాము కనిపెట్టకపోయినా హ్యాపీగా వాడేసుకుంటోంది. దాన్ని టీడీపీ అనుకూల మీడియ కూడా బాగానే వాడుకుంటోంది. అది వేరే విషయం. ఇక కోపం వచ్చినపుడు జూమ్ మీటింగులలో చంద్రబాబు కూడా ఏం జగన్ రెడ్డీ అంటూ గట్టిగానే గద్దిస్తారు. ఎవరు ఎలా దీన్ని వాడుకుంటున్నా లోకేష్ అంత మాత్రం కాదనే చెప్పాలి. లోకేష్ ట్విట్టర్ ఈ పేరు లేకుండా అసలు పలకదు. ఆయన రోజుకు నాలుగైదు సార్లు అయినా జగన్ రెడ్డీ అంటూ ట్వీటుతూంటారు. ఏ సమస్య వచ్చినా నేరుగా జగన్ కే తగిలించేసి దీనికి బదులు ఏం చెబుతారు జగన్ రెడ్డీ అంటూ నిలదీస్తారు.
పాపం చినబాబు ఈ విధంగా బాగానే సంబరపడుతున్నారు. తాను జగన్ స్థాయి నాయకుడిని అని... వెయిటింగ్ చీఫ్ మినిస్టర్‌ని అని కూడా భావిస్తూంటారు. కానీ ఇంతకీ జగన్ రెడ్డి పలికితేనా. కనీసం స్పందిస్తేనా. ఆయన అసలు పట్టించుకోరు కదా.. ? అలా రెస్పాండ్ అయి తన దానికి రివర్స్ లో కౌంటర్ వేసినా తన నాయకత్వ పటిమ రుజువు అయినట్లే అని లోకేష్ భావిస్తున్నారు. కానీ జగన్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగానే ఉంటున్నారు. దాంతో దీర్ఘాలు తీసి తీసి లోకేష్ బాగా అలసిపోతున్నారు. ఆయన మీడియా ముందు కూడా జగన్ రెడ్డీ అని గొంతు చించుకుంటున్నా రెస్పాన్స్ అయితే లేదు.
అదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం లోకేష్ కి తనదైన శైలిలో పంచులు వేస్తూంటారు. లోకేష్ ని మాలోకం అని పేరు పెట్టి మరీ ఎక్కడో కాలేలా విమర్శలు చేస్తారు. అటు జగన్ పలకక ఇటు సాయిరెడ్డి మాలోకం పిలుపునకు రెస్పాండ్ కాలేక లోకేష్ తెగ సతమతమవుతున్నారట. ఏది ఏమైనా చినబాబు రాజకీయాల్లో ఇంకా చినబాబే అని తమ్ముళ్ళు అంటున్నారంటే ఇలాంటివి చూసే మరి.