• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లాక్ డౌన్: భార్యల నుంచి...

లాక్ డౌన్: భార్యల నుంచి కాపాడండి: సీఎంకు పురుషుల లేఖ

By - Tupaki Desk
Update: 2020-04-22 03:45 GMT
ట్రెయిన్ రివర్స్ అవ్వడం అంటే ఇదే.. ఇన్నాళ్లు భర్తల నుంచి కాపాడండి అంటూ భార్యలు రోడ్డెక్కేవారు. మహిళల రక్షణకు చట్టాలు, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. మరి పాపం భర్తలు ఏం చేశారు.. వాళ్ల బాధలు ఎవరికి చెప్పుకోవాలి?  లాక్ డౌన్ తో నెలరోజులుగా ఇంటికే బందీ అయి పోయిన భర్తలను భార్యలు తీవ్రంగా వేధిస్తున్నారట.. ఊరికే తిని కూర్చుంటున్న భర్తలను లోకువగా చూస్తున్నారట.. వారి గృహహింసతో ఇప్పుడు భర్తలంతా కుయ్యో మొర్రో అంటున్నారు.బయటకు చెబితే పరువు పోతుందని ఉగ్గబట్టుకుంటున్నారు.

అయితే తమిళనాడు భర్తలు మాత్రం వాళ్ల భార్యల గృహహింసను తట్టుకోలేక బయటకొచ్చారు. తమను రక్షించండి మహోప్రభో అని తమిళనాడు సీఎంకు వినతిపత్రం అందించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి భార్యల నుంచి రక్షించండి అంటూ మొరపెట్టుకున్నారు.

ఇళ్లకే పరిమితమైన భర్తలను భార్యలు తీవ్రంగా వేధిస్తున్నారని తమిళనాడు పురుషుల రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్ తమిళన్ తాజాగా తమిళనాడు సీఎం ఫళని స్వామికి ఒక వినతిపత్రం అందించారు.

లాక్ డౌన్ తో ఇంట్లో ఉంటున్న భర్తలను భార్యలు భౌతికంగానే కాదు.. మానసికంగానూ బాధ పెడుతున్నారని పురుషుల సంఘం అధ్యక్షుడు అరుళ్ వినతిపత్రంలో పేర్కొన్నారు. మహిళా రక్షణ, సంక్షేమ చట్టాలను చూపి భర్తలను భయపెడుతున్నారన్నారు. భార్యలకు సపోర్టుగా పోలీసుల ప్రకటనలు కూడా భర్తలను మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. మగవారి బాధలను తెలుపుకునేందుకు వెంటనే ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
Tags:    
  • Corona Virus In Tamilnadu 
  • Tamil News 
  • Tamilnadu 
  • Corona Virus 
  • Corona Virus In Chennai 
  • Telugu News 
  • Tamilnadu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS