మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన హైద‌రాబాద్ మెట్రో!

Update: 2017-11-28 17:30 GMT
హైద‌రాబాద్ మెట్రో ఏమిటి? ప‌్ర‌ధాని మోడీ ప‌రువు తీయ‌టం ఏమిట‌న్న సందేహం అక్క‌ర్లేదు. నిజంగానే. కాకుంటే.. కాస్త ఓపిగ్గా చ‌దివితే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హైద‌రాబాద్ మెట్రో ఈ రోజు వాస్త‌వ రూపం దాల్చ‌ట‌మే కాదు.. జాతికి అంకిత‌మైంది. హైద‌రాబాద్ మెట్రోను ప్ర‌ధాని మోడీ  ప్రారంభించారు.

రేప‌టి నుంచి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్న ఈ మెట్రోతో హైద‌రాబాద్ న‌గ‌ర వాసుల ట్రాఫిక్ న‌ర‌కం నుంచి త‌ప్పించుకోవ‌చ్చ‌న్న ఆశాభావం ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇంత‌కీ హైద‌రాబాద్ మెట్రో.. ప్ర‌ధాని మోడీ ప‌రువు ఎలా తీసింద‌న్న డౌట్ వ‌స్తోంది? అక్క‌డికే వ‌స్తున్నాం. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని స‌మ‌యం.. సంద‌ర్భం చూసుకొని లాగి పెట్టి కొట్టిన‌ట్లుగా సంధించే ప్ర‌శ్నాస్త్రం ఇప్పుడు ప‌వ‌ర్ ఫుల్ గా మారింది. హైద‌రాబాద్ మెట్రో రైలు ప్రారంభం సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఒక క్లిప్ ఇప్పుడు విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

గ‌తంలో మాదిరి మోడీని కీర్తించ‌టం కంటే.. ఆయ‌న త‌ప్పుల్ని తెలివిగా ఎత్తిచూపే విప‌క్ష పార్టీలు.. మోడీ వ్య‌తిరేకుల గ‌ళం మ‌రింత పెరుగుతోంది. దీనికి నిద‌ర్శ‌నంగా తాజాగా వైర‌ల్ అయిన పాత క్లిప్ ను చూడొచ్చు. కొచ్చి మెట్రో విడుద‌ల స‌మ‌యంలో వైర‌ల్ అయిన ఈ ఇమేజ్ లో.. 1095 రోజుల్లో మెట్రో క‌ల‌ను నిజం చేస్తామ‌ని హామీ ఇచ్చి అంత‌కంటే ముందుగా అంటే.. 985 రోజుల్లోనే ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చార‌ని  వెల్ల‌డించారు. అదే స‌మ‌యంలో గుజ‌రాత్ లోని అహ్మాదాబాద్ న‌గ‌రంలో 2003లో మెట్రోను ప్ర‌క‌టించార‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ దాని ఊసే లేద‌ని పంచ్ ఇచ్చారు. బీజేపీ స‌ర్కారు అధికారంలో లేని రాష్ట్రాల్లో మెట్రోల‌ను వ‌రుస‌గా ప్రారంభించే ప్ర‌ధాని మోడీ.. తాను ప్రాతినిధ్యం వ‌హించే గుజ‌రాత్ రాష్ట్రంలో అప్పుడెప్పుడో 14 ఏళ్ల క్రితం ప్ర‌క‌టించిన మెట్రో క‌ల‌ను ఇంకా ఎందుకు సాకారం చేయ‌లేదంటూ ప్ర‌శ్నిస్తున్నారు. చూసినంత‌నే ఆక‌ర్షించేలా ఉన్న ఈ ఇమేజ్ హైద‌రాబాద్ మెట్రో ప్రారంభం సంద‌ర్భంగా మ‌ళ్లీ పోస్ట్ చేయ‌టం మొద‌లు పెట్టారు. ఇప్పుడు అర్థ‌మైందా?  హైద‌రాబాద్ మెట్రో రైల్ మోడీ ఇమేజ్ ను ఎలా డ్యామేజ్ చేస్తుందో..?
Tags:    

Similar News