నోటాపై కాంగ్రెస్ ఘన విజయం సాధించిందిగా!
వినడానికి కామెడీగానే ఉన్నా నిజమే మరి! అందరిదీ ఒకదారి అయితే ఉలికిపిట్టది ఒకదారి అన్న చందంగా మారిపోయింది కాంగ్రెస్ పరిస్థితి! నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ - వైసీపీ హోరాహోరీగా పోరాడితే.. ఆటలో అరటిపండులా.. ఉనికి కోసం కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. అంతేకాదు.. చివరికి మైనారిటీల ఓట్లు చీల్చేందు కు ముస్లిం అభ్యర్థిని రంగంలోకి దించింది. ఎన్ని చేసినా టీడీపీ - వైసీపీలకు గట్టి ఇవ్వలేకపోయిన కాంగ్రెస్.. నోటాకు మాత్రం ఎన్నడూ లేనంత గట్టి పోటీ ఇచ్చింది. మరి ఇంత గట్టిగా పోటీ పడితే నెటిజన్లు ఊరుకుంటారా చెప్పండి! ఇప్పుడ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పై వాగ్భాణాలు - చమత్కార బాణాలు - వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఏపీలో ఆసక్తిని కల్గించిన నంద్యాల ఉపఎన్నికలో అధికార టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి విజయం సాధించారు. ఊహించిన దాని కంటే మంచి మెజారిటీ వచ్చిందని నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు నంద్యాల ఉపఎన్నికను సెమీ ఫైనల్స్ గా భావించడంతో టీడీపీ - వైసీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. అయితే రాష్ట్ర విభజనతో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్.. పునర్వైభవం కోసం తీవ్రంగా కష్టపడుతోంది. దీంతోపాటు మూడేళ్లలో పరిస్థితి మారుతుందని.. నంద్యాలలో కొంతైనా ప్రభావం చూపితే చాలని నేతలు ఆశించారు. అంతేకాదు.. రఘువీరారెడ్డి నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికల్లో స్వయంగా ప్రచారం నిర్వహించారు.
అయితే చివరకు కాంగ్రెస్ కు నోటాతో పోటీపడాల్సిన పరిస్థితి వచ్చింది. నంద్యాల ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్ కు 1382 ఓట్లు పోలయ్యాయి. ‘నోటా'ను 1231 మంది ఎంచుకున్నారు. దీనిని గమనించిన కొందరు నెటిజన్లు.. కాంగ్రెస్ పై చలోక్తులు విరుసుతున్నారు. `నంద్యాల ఎన్నికల్లో నోటాతో పోటీపడ్డ కాంగ్రెస్` అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిందని నంద్యాల ఎన్నికలు స్పష్టం చేశాయంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోని పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెస్ మాత్రమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.