శశికళ చేతిలో ఫోన్?

Update: 2017-02-19 06:46 GMT
చేతి వరకూ వచ్చిన సీఎం పదవి చేజారిపోతే ఎంత బాధ ఉంటుందో.. అందరి కంటే ఎక్కువ చిన్నమ్మకే బాగా తెలుసు. తన ఉక్రోషాన్ని ఆపులేక.. తనకు విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలపై ఆమె ప్రదర్శించిన ఆగ్రహం అంతాఇంతా కాదని చెబుతారు.  ఊహించని విధంగా గవర్నర్ నుంచి అనుమతి రాకపోవటం.. అక్రమాస్తుల కేసులో శిక్ష పడటం లాంటివి చకచకా చోటు చేసుకున్నాయి.

చిన్నమ్మ వరకూ చూస్తే.. ఇలాంటి పరిస్థితులకు కారణం  పన్నీర్ సెల్వమే. అందుకే ఆయన్నుఅంత తేలిగ్గా వదిలిపెట్టేది లేదని ఆమె సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా చెబుతారు. దీనికి తగ్గట్లే బలనిరూపణ పరీక్ష నెగ్గిన వెంటనే ముఖ్యమంత్రి పళనిస్వామి మాట్లాడుతూ.. పన్నీరు సెల్వం పెద్ద తప్పు చేశారని.. అందుకు మూల్యం చెల్లించక తప్పదని పేర్కొనటాన్నిమర్చిపోకూడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాను కూర్చోవాల్సిన సీఎం కుర్చీలో తాను కూర్చోలేకున్నా.. తాను ఎంపిక చేసిన వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చోవటం చిన్నమ్మకు కొంతలో కొంత ఊరటగా చెప్పాలి.

ఎంతో ఉత్కంటను రేపిన బలపరీక్షలో విజయం సాధించిన వైనాన్ని జైల్లోని టీవీలో లైవ్ టెలికాస్ట్ చూసిన చిన్నమ్మ ఆనందానికి హద్దుల్లేకుండా పోయినట్లు చెబుతున్నారు. బలనిరూపణ పూర్తి అయిన వెంటనే.. పళనిస్వామిని ఫోన్ చేసి అభినందించినట్లుగా తెలుస్తోంది.సాయంత్రం నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ఆమె ఫోన్లో మాట్లాడినట్లుగా చెబుతున్నారు.

జైల్లో ఆమెను సాధారణ ఖైదీలా చూడాలని న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. గదిలో టీవీ సౌకర్యం లేని ఆమెకు.. టీవీ చూడాలన్న అభ్యర్థనను జైలు అధికారులు మన్నించి.. టీవీ చూడనిచ్చారు.అయితే.. జైల్లో ఉన్న శశికళ  చేతికి ఫోన్ ఎలా వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. దీనికి సమాధానం ఇచ్చే వారెవరు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News