లవ్ జిహాద్ ఆర్డినెన్స్ ఓ రాజకీయ స్టంట్: ఎంపీ
ఉత్తరప్రదేశ్ లో లవ్ జిహాద్ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీస్తోంది. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం చేయాలని భావిస్తోన్న ‘ఉత్తరప్రదేశ్’ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది.
లవ్ జిహాద్ పేరిట రెండు మతాల యువత మధ్య జరిగే ఈ వివాహాల్లో మతమార్పిడిలను పరిశీలించడానికి ఉద్దేశించిన ఈ ఆర్డినెన్స్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
తాజాగా సమాజ్ వాది ఎంపీ ఎస్టీ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యూపీలో ముస్లిం కుర్రాళ్లు, హిందూ యువతులను సోదరిమణులుగా భావించాలి. కాదని ప్రేమ, పెళ్లి అంటే ప్రభుత్వం మిమ్మల్ని ఈ ఆర్డినెన్స్ కింద అరెస్ట్ చేసి టార్చర్ చేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త’ అని సమాజ్ వాదీ ఎంపీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
లవ్ జిహాద్ అనేది రాజకీయ స్టంట్ అని.. మన దేశంలో ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు ఉందని ఎంపీ హాసన్ తెలిపారు. హిందువులు, ముస్లింలను.. ముస్లింలు, హిందువులను సంతోషంగా వివాహం చేసుకుంటున్నారు. ఒకసారి ఆ జంటలను పరిశిలిస్తే.. వారు ఎంత సంతోషంగా జీవిస్తున్నారో తెలుస్తుంది. దురదృష్టవశాత్తు వారి మధ్య విబేధాలు వస్తే.. అప్పుడు అందరు వరుడు ముస్లిం.. అందుకే ఇలా బాధిస్తున్నారు అంటూ లేనిపోని ఆరోపణలు చేయడం ప్రారంభిస్తారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో ముస్లిం యువకులకు తాను ఒకటే చెబుతున్నానని.. హిందూ యువతులను మీ అక్కాచెల్లెళ్లుగా భావించండి .. లేదంటే ప్రభుత్వం మిమ్మల్ని టార్చర్ చేస్తుంది అని ఎస్పీ హాసన్ మండిపడ్డారు. ఇప్పటికే యూపీలోని యోగి సర్కార్ తెచ్చిన ఈ ఆర్డినెన్స్ పై ప్రతిపక్ష సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.