• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గమనించారా... సజ్జల సౌండ్...

గమనించారా... సజ్జల సౌండ్ లేదు...?

By - Tupaki Desk
Update: 2022-03-28 01:30 GMT
వైసీపీలో ఆయనను సకల శాఖల మంత్రిగా ఆఫ్ ది రికార్డ్ గా చెబుతారు. విపక్షాలు, ప్రత్యర్ధులు అయితే ఆయనే అన్ని శాఖలలూ చూస్తారని వెటకారం ఆడతారు. ఆయన ఎవరో కాదు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి. జగన్ మనసులో ఏముందో అది సజ్జల నోట్లో నుంచి వస్తుంది అని కూడా అంటారు. ఒక విధంగా ముఖ్యమంత్రికి  ఆయన అధికార ప్రతినిధిగా చెప్పుకుంటారు.

అలాంటి సజ్జల సౌండ్ కొంతకాలంగా వినిపించడంలేదు. ఏపీలో ఈ మధ్య కాలంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. కానీ సజ్జల మీడియా తరఫున అయితే పెద్దగా అలికిడి చేయడంలేదు. ఆయన ఈ నెల 12న పార్టీ ఆవిర్భావ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన సందడి చేసింది  ఎక్కడా చూడలేదని అంటున్నారు.

అసెంబ్లీ సెషన్ హోరులో సజ్జల ఊసుని  అంతా మరచినా  ఇపుడు గుర్తు చేసుకుంటూ ఆయన ఎక్కడ ఉన్నారబ్బా అని ఆరా తీస్తున్నారుట. అయితే సజ్జల ఏమీ ఖాళీగా లేరు. పైగా ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు. ఏపీలో వైసీపీ మంత్రివర్గ విస్తరణ తొందరలో ఉంది.

దాంతో ఈసారి మంత్రివర్గం ఎన్నికలతో కూడుకున్నది. అనేక సామాజిక వర్గ సమీకరణలు చూడాలి. ఎన్నో కూర్పులు మార్పులూ చేయాలి. దాంతో వైసీపీ హై కమాండ్ మంత్రి వర్గానికి సంబంధించి ఆశావహుల జాబితాను దగ్గర ఉంచుకుని షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసే కీలకమైన బాధ్యతలను సజ్జలకు అప్పగించింది అంటున్నారు.

దాంతో సజ్జల ఇపుడు కూడికలు తీసివేతలతో ఫుల్ బిజీ అంటున్నారు. ఇక మంత్రి పదవిని కోరుకున్న వారు ఆశావహులు అంతా కూడా సజ్జలనే కలుస్తున్నారు అని తెలుస్తోంది. మొత్తానికి మంత్రి వర్గ విస్తరణ కాదు కానీ సజ్జల తెర వెనక కసరత్తులో నిండా పనిలో ఉన్నారని అంటున్నారు.

అలా ఆయన  అధినాయకత్వానికి ఎప్పటికపుడు అందుబాటులో ఉంటూ కొత్త మంత్రుల జాబితా తయారీలో సహాయం చేస్తున్నారు అంటున్నారు. మరి ఇదంతా బాగుంది కానీ రేపటి రోజున పదవులు రాని వారు సజ్జల మీద తమ బాణాలు ఎక్కుపెడతారేమో చూడాలి అంటున్నారు.
Tags:    
  • Sajjala Ramakrishna Reddy 
  • YSRCP 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS