మాటలతో బోల్తా.. పరీక్ష రాయకుండానే సివిల్స్ విజేత
గడిచిన కొద్దిరోజులుగా ప్రముఖ మీడియా సంస్థలు మొదలు చిన్నపాటి మీడియాలోనూ సచిన్ మగ్గడి అనే యువకుడి వీరోచిత గాథ అంటూ సక్సెస్ ఫుల్ స్టోరీలు పబ్లిష్ అయ్యాయి. అయితే.. జిల్లా స్థాయిలో ప్రచురితమైన ఇతగాడి అసలు కథ వింటే దిమ్మ తిరిగిపోవాల్సిందే. పరీక్ష రాయకుండానే సివిల్స్ విజేతగా బిల్డప్ ఇచ్చే ఇతగాడి తీరుకు నోరు వెళ్లబెతుడున్నారు. గడిచిన రెండేళ్లుగా సివిల్స్ పరీక్షా ఫలితాలు రావటం.. అందులో సచిన్ మగ్గడి సక్సెస్ స్టోరీ కథలు.. కథలుగా మీడియాలో రావటం అలవాటే.
మరి.. గత ఏడాది సివిల్స్ సాధిస్తే.. మళ్లీ ఈ ఏడాది ఏమిటన్న సందేహం ఎవరికైనా వస్తే.. తాను కోరుకున్న ఐఏఎస్ రాలేదన్న మాటను చెబుతాడు. ఇతగాడి హంగామాకు జిల్లాస్థాయి అధికారులు సైతం బోల్తా పడటం ఈ ఎపిసోడ్ లో అసలు సిసలు ట్విస్టుగా చెప్పాలి. నిజామాబాద్ కు చెందిన సచిన్ మగ్గడి తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
గత ఏడాది (2019)లో సివిల్స్ ఫలితాలు వెలువడిన వేళలో సచిన్ కుమార్ అనే వ్యక్తికి 669 ర్యాంకు వస్తే.. అది తనదేనని అందరిని నమ్మించాడు సచిన్ మగ్గడి. ఢిల్లీలో యూపీఎస్పీ కార్యాలయం వద్ద ఫోటోలు దిగి ఇంటర్వ్యూకు హాజరయ్యానంటూ చేసిన హంగామా అందరికి గుర్తే. అతగాడి గురించి తెలుసుకున్న పలువురు.. పరిచయం చేసుకోవటం.. అభినందనలు తెలపటం లాంటివి చేశారు.
వాటిని సోషల్ మీడియాలో పెట్టుకొని మరింత బిల్డప్ ఇచ్చాడు. మరి. శిక్షణకు ఎందుకు వెళ్లలేదని అడిగితే.. తన లక్ష్యం ఐఏఎస్ అని.. అందుకే ఆగినట్లు చెప్పేవాడు. ఈసారి సివిల్స్ ఫలితాల విడుదల వేళ..296వ ర్యాంకు సాధించిన సచిన్ యాదవ్ అనే విజేత పేరును వాడేయటం షురూ చేశాడు. అయితే.. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. సచిన్ యాదవ్ ఓబీసీ కాగా.. సచిన్ మగ్గడి షెడ్యూల్ కులాలకు చెందినవారు కావటంతో పలువురికి అనుమానం కలిగింది.
దీనికి తోడు.. సచిన్ కుమార్.. సచిన్ యాదవ్ ల మాక్ ఇంటర్వ్యూల వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. వాటిని పరిశీలించినపలువురు సచిన్ మగ్గడి ఫేక్ ర్యాంకర్ అన్న విషయాన్ని గుర్తించి నిజామాబాద్ కలెక్టరేట్ లో కంప్లైంట్ చేశారు. దీంతో.. అతగాడి గురించి ఆరా తీస్తున్నారు. ఇంతకాలం తనను తాను విజేతగా ప్రకటించుకున్న అతగాడి తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది.