రూ.550 కోట్లు స్వాధీనం: హెటెరో సోదాలపై ఐటీ శాఖ

Update: 2021-10-09 11:12 GMT
హెటెరో ఫార్మా కంపెనీలో ఇప్పటివరకూ జరిగిన సోదాల్లో రూ.550 కోట్ల లెక్కచూపని ఆదాయం కనుగొన్నామని ఐటీ శాఖ చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. ఇందులో రూ.142.87 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆరు రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ప్రకటించింది.

సోదాల్లో మొత్తం 16 బ్యాంకు లాకర్లు గుర్తించారు. సంస్థకు సంబంధించిన ప్రదేశాల్లోని పలు రహస్య స్థావరాల్లో లెక్కలకు సంబంధించిన పుస్తకాలు, నగదు, ఖాతాలు, నగదుకు సంబంధించిన రెండో సెట్ పుస్తకాలు కనుగొన్నారు.

పెన్ డ్రైవ్ లు, డాక్యుమెంట్లు, ఉనికిలో లేని సంస్థల నుంచి చేసిన కొనుగోళ్లు వంటి వ్యవహారాలను గుర్తించారు. వీటిని విశ్లేషించి సంస్థ మొత్తం ఎంత మేర అక్రమ ఆదాయాన్ని గడించిందో ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా హెటిరో పేరును మాత్రం తన ప్రకటనలో వెల్లడించలేదు.

ప్రతీసారి ఐటీ శఆఖ ఎంత నగదు దొరికిందో వివరిస్తుంది కానీ.. ఎప్పుడూ సంస్థ పేరు చెప్పదు.. ఇప్పుడు కూడా చెప్పలేదు. అయితే హైదరాబాద్ లో గత మూడు రోజులుగా హెటెరోలో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ హెటెరోలో చేసిన సోదాల గురించే ప్రకటించినట్టు భావించవచ్చు.




Tags:    

Similar News