ప్రముఖ ర్యాపర్ పై రూ.218 కోట్లకు దావా

Update: 2021-01-31 11:30 GMT
ప్రముఖ అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్  చిక్కుల్లో పడ్డారు. అతడికి లీగల్ వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే విడాకులు తీసుకోవాలని భావించి కోర్టు మెట్లు ఎక్కిన కాన్యే వెస్ట్ కు తాజాగా సండే సర్వీసెస్ నుంచి లీగల్ నోటీసులు అందాయి.

ర్యాపర్ వెస్ట్ కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.  ఆయన మీద 30 మిలియన్‌ డాలర్లకు(దాదాపు 218 కోట్ల రూపాయలు) దావా వేశారు.. కాన్యే తన సండే సర్వీసెస్, ఇతర ప్రదర్శనలకు సంబంధించిన క్లాస్-యాక్షన్ సూట్లను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం లాస్ ఏంజిల్స్‌లో ఈ దావాలు దాఖలు చేశారు. ఇక వీటిలో వందలాది వర్కర్స్‌, స్టాఫ్‌ కాన్యే చెల్లింపులో చాలా ఆలస్యం చేస్తాడని, వాటిలో ఊహించని కోతలు, ఉద్యోగంలో దుర్వినియోగం వంటి వాటి గురించి వెల్లడించారు.

ఇక కాన్యే మీద రెండు వ్యాజ్యాలు దాఖలు కాగా.. మొదటిది 500 మంది వర్కర్స్‌ తరఫున దాఖలైంది. డైలీ మెయిల్ యూఎస్ ప్రకారం కాన్యే వెస్ట్‌ వారికి కనీసం భోజనం చేయడానికి సమయం ఇవ్వకుండా, విరామం లేకుండా రెండు రోజులు ఏకధాటిగా పని చేయించడాని కార్మికులు ఆరోపించారు.కాన్యే వెస్ట్‌ 2019 ఒపెరా "నెబుచాడ్నెజ్జార్" ప్రదర్శనలో పని చేసిన వారు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు.

ఇక తాము కోల్పోయిన బ్రేక్‌ టైం, పని చేసిన ఓవర్‌ టైంకు సంబంధించి నష్ట పరిహారం పొందేందుకు గాను దావా దాఖలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాన్యే సండే సర్వీసులకు సంబంధించిన మరో దావాను టెక్ కంపెనీ మైచానెల్ ఇంక్ దాఖలు చేసినట్లు పత్రికలు తెలిపాయి.. ఆ దావాలో వర్కర్స్‌ ఆరు నెలలుగా తమకు వేతనం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ రెండు దావాల వల్ల కాన్యే సుమారు 30 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారాన్ని వారికి చెల్లించాలి. దీంతో ఈ ర్యాపర్ ఇప్పుడు తీవ్ర చిక్కుల్లో పడ్డారు.
Tags:    

Similar News