మనీశ్ వీర విధ్వంసం..రేసులోనే రైజర్స్!

Update: 2020-10-23 03:15 GMT
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్  హైదరాబాద్ జూలు విదిల్చింది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు  బౌలింగ్ లోనూ సత్తా చాటి కీలక విజయం సాధించింది.ప్లే ఆఫ్స్ రేసు లోకి వచ్చింది. చాన్నాళ్ల తర్వాత మనీశ్ పాండే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి విజయ శంకర్ సహకారం అందించడంతో స న్ రైజర్స్ చరిత్రలోనే రికార్డు స్థాయి భాగస్వామ్యం నమోదు చేశారు. ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టంగామారాయి.ముందుగా బ్యాటింగ్‌ చేసిన  రాజస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. శాంసన్‌ (36), స్టోక్స్‌ (30) మాత్రమే రాణించారు. బట్లర్‌ (9), రియాన్ (20)స్మిత్‌ (19) విఫలం చెందారు. సన్  రైజర్స్ బౌలర్ హోల్డర్‌ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రషీద్‌ ఓ వికెట్‌ తీశాడు.

ఆ తర్వాత ఛేదనలో వన్ డౌన్ లో మనీశ్‌ పాండే (47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 నాటౌట్‌) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో తొలిసారి  విజయ్‌ శంకర్‌ (51 బంతుల్లో 6 ఫోర్లతో 52 నాటౌట్‌) మంచి ప్రదర్శన చేశాడు.  దీంతో  హైదరాబాద్‌ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 156 పరుగులు ఛేజ్ చేసింది. మనీశ్  మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కించుకున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ పై  గెలుపు తో 8 పాయింట్ల తో రైజర్స్‌ ఐదో స్థానానికి చేరుకుంది. రాజస్థాన్‌ ఓటమి తో  ఏడో స్థానానికి పడి పోయింది.

 మనీశ్‌, విజయ్‌  రికార్డు భాగస్వామ్యం

ఛేదనలో ఆర్చర్‌ రైజర్స్ కి గట్టి స్ట్రోక్ ఇచ్చాడు.తొలి ఓవర్‌లోనే వార్నర్‌ (4), ను మూడో ఓవర్‌లో బెయిర్‌స్టో (10) వికెట్లను తీశాడు. దీంతో వన్ డౌన్లో బ్యాటింగ్ కి దిగిన మనీశ్, విజయ్ శంకర్ తో కలిపి ఇన్నింగ్స్ నడిపించాడు. కడదాకా నిలిచి 140 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. మనీశ్ సిక్సర్ల మోత మోత మోగించాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 సిక్సులు ఉన్నాయంటే అతడి బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మనీశ్ 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు.

విదేశీ బ్యాట్స్ మెన్ ప్రమేయం లేకుండానే..

సన్‌రైజర్స్‌ తరఫున ఐపీఎల్‌లో శతక భాగస్వామ్యాన్ని అందించిన తొలి భారత జోడీగా మనీశ్‌- విజయ్‌ శంకర్‌ రికార్డ్ సృష్టించారు. అంతకు ముందు పలు రికార్డ్ భాగస్వామ్యాలు నమోదైనా విదేశీ క్రికెటర్ ప్రమేయం లేకుండా నమోదైన అత్యధిక భాగస్వామ్యం ఇదే.
Tags:    

Similar News