ముంబైకి రాజస్థాన్ స్ట్రోక్..పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ వృథా

Update: 2020-10-26 04:00 GMT
వరుస విజయాలతో టోర్నీలో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ కి రాజస్థాన్ రాయల్స్ షాకిచ్చింది. తప్పక గెలిచి తీరాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ అద్భుతంగా విజయం సొంతం చేసుకుంది. 196 పరుగుల టార్గెట్ ని ఛేదించి ప్లే ఆఫ్స్  అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ముంబై బ్యాట్స్ మెన్ హార్దిక్ పాండ్యా సిక్సర్లతో విధ్వంసం సృష్టించినా రాజస్థాన్ బ్యాట్స్ మెన్ బెన్ స్ట్రోక్స్ చక్కటి సెంచరీ సాధించి జట్టుకు విజయం అందించాడు.ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ క్వింటాన్‌ డీకాక్‌(6) విఫలమవగా..  ఇషాన్‌ కిషన్‌(37; 36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌)సూర్యకుమార్‌(40; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌),  సౌరవ్‌ తివారీ(34; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌), రాణించారు.చివర్లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (60 నాటౌట్‌; 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) సిక్సులతో విధ్వంసం సృష్టించాడు.ఫోర్ల కంటే సిక్సర్లే సులభంగా బాదేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఛేదనలో  రాబిన్‌ ఊతప్ప(13;11 బంతుల్లో 2 ఫోర్లు)వికెట్‌ను రాజస్తాన్‌ మొదట్లోనే వికెట్‌ కోల్పోయింది.స్టీవ్‌ స్మిత్‌(11; 8 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) తొందర గానే పెవిలియన్ బాట పట్టాడు.

స్టోక్స్, సంజూ రికార్డు భాగస్వామ్యం

అనంతరం బెన్‌ స్టోక్స్‌(107 నాటౌట్‌; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), అద్భుత సెంచరీకి తోడు సంజూ శాంసన్‌(54 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో   రాజస్తాన్‌ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది.  ఏకంగా ఈ జోడి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రాజస్తాన్‌ సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇది రాజస్తాన్‌కు ఐదో విజయం కాగా, ముంబైకు నాల్గో ఓటమి.

హార్దిక్ మెరుపులు

ముంబై ఓడినా హార్దిక్ బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో తొలిసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.18 ఓవర్‌లో హార్దిక్‌ చెలరేగిపోయాడు. తొలి బంతికి సిక్స్‌ కొట్టిన హార్దిక్‌.. నాలుగు, ఐదు, ఆరు బంతుల్ని సిక్స్‌లు కొట్టాడు. హార్దిక్‌ హ్యాట్రిక్‌ సిక్స్‌లు సాధించడంతో ఆ ఓవర్‌ లో ఏకంగా  27 పరుగులు వచ్చాయి. త్యాగి వేసిన చివరి ఓవర్‌ లో హార్దిక్‌ మరో సారి చెలరేగాడు. మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టడం తో ఆ ఒక్క ఓవర్లోనే 27 పరుగులు వచ్చాయి. హార్దిక్ మెరుపుల తో చివరి ఐదు ఓవర్లలో ముంబై జట్టుకు  79 పరుగులు వచ్చాయి.
Tags:    

Similar News