• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రోజా ప్ర‌శ్నిస్తే బండ్ల...

రోజా ప్ర‌శ్నిస్తే బండ్ల గ‌ణేష్ రాళ్లేశాడు

By - Tupaki Desk
Update: 2017-12-13 05:14 GMT
ఓ టీవీ చాన‌ల్ చ‌ర్చాగోష్టిలో..వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా - సినీ న‌టుడు బండ్ల గ‌ణేష్ మ‌ధ్య వాదోప‌వాదాలు సాగాయి. స‌ద‌రు చ‌ర్చ‌లో ఫోన్ లైన్లో రోజా మాట్లాడుతుండ‌గా...స్టూడియోలో ఉన్న గ‌ణేష్ ఈ సంద‌ర్భంగా రోజాపై మండిప‌డ్డారు. రోజా ప‌ళ్లు రాల‌గొడ‌తానంటూ హెచ్చ‌రించారు. గ‌ణేష్ ఇంత‌గా బెదిరించేందుకు కార‌ణం జ‌న‌సేన‌ అదినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ పై చేసిన కామెంట్ల‌ను రోజా తప్పుప‌ట్ట‌డ‌మే.

ఆ టీవీ చ‌ర్చ‌లో వారసత్వ రాజ‌కీయాలు - ప్ర‌జాభిమానం గురించి చ‌ర్చ న‌డుస్తుండ‌గా రోజాను ఫోన్ లైన్లోకి తీసుకున్నారు.  ఈ సంద‌ర్భంగా రోజా మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డిని వార‌స‌త్వ నాయ‌కుడిగా చూడ‌లేమ‌న్నారు. `వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జాభిమానంతో ముందుకు వెళుతూ 67 మందిని గెలిపించుకొని ముందుకు సాగుతున్నాడు. ఆయన ముందుకు సాగుతున్న తీరును వార‌స‌త్వం రాజకీయం అన‌లేం. అలాంట‌పుడు, అన‌వ‌స‌ర‌మైన స‌మ‌యంలో,అన‌వస‌రంగా జ‌గ‌న్‌ను అనాల్సిన అవ‌స‌రం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు ఏం వ‌చ్చింది?జ‌గ‌న్ ఏ రోజు ప‌వ‌న్ గురించి మాట్లాడ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ మాట్లాడుతున్నారు. వైఎస్ జ‌గ‌న్‌ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఎంపీగా త‌న తండ్రి కార‌ణంగా బ‌రిలో నిలుచున్నారేమో కానీ ఈ 8 ఏళ్ల‌లో త‌న‌కంటూ ఒక పార్టీ పెట్టుకొని సిద్ధాంతాలు తీర్చిదిద్దుకొని ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం ముందుకు సాగుతున్నారు. అంతే త‌ప్ప టైం పాస్ రాజ‌కీయాలు చేయ‌ట్లేదు. అందుకే ఆయ‌న్ను అనే నైతిక హ‌క్కు లేదు` అని రోజా స్పష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా `చిరంజీవి గారి ఇంట్లో త‌క్కువమంది క‌ష్ట‌ప‌డిన వారు ఉన్నారు. ఎన్టీఆర్‌ - ఏఎన్నార్‌ - కృష్ణంరాజు - కృష్ణ ప్ర‌ముఖ న‌టులుగా ఉన్న స‌మ‌యంలో వాళ్లంద‌రినీ తోసిరాజ‌నే విధంగా క‌ష్ట‌ప‌డి నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరారు. కానీ చిరు త‌మ్ముళ్లు - కొడుకు - మేన‌ల్లుడు - చిన్న‌ అల్లుడు ..కేవ‌లం చిరు చ‌రిష్మాతో వ‌స్తున్నారు. వాళ్ల‌ది వార‌స‌త్వం` అంటూ రోజా మాట్లాడుతుండ‌గా...  బండ్ల గ‌ణేష్  ఆ చ‌ర్చ‌కు అడ్డుప‌డ్డారు. దీంతో ఎమ్మ‌ల్యే రోజా `అభిమానిగా మీరు మాట్లాడితేనే నేనేం చేయ‌లేను. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ గురించి జ‌గ‌న్ ఎనాడైనా మాట్లాడారా? అయినా ఆయ‌న విమ‌ర్శ‌లు ఎందుకు? ` అంటూ ప్ర‌శ్నించారు. దీనిపై గ‌ణేష్ స్పందిస్తూ `ఆడు ఈడు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను విమ‌ర్శించ‌డం స‌రికాదు` అన్నారు. దీంతో రోజా`మీరు ఆవేషం త‌గ్గించుకోండి. పాయింట్ మీద మాట్లాడండి` అని సూచించ‌గా... ``అలా మాట్లాడ‌టం రాదు. అలా పాయింట్ మీద మాట్లాడ‌టం వ‌ల్లే ఎమ్మెల్యే అయ్యారు. రెండు సార్లు ఓడిపోయి ఓ సారి ఎమ్మెల్యే అయ్యారు. దేశం మొత్తం మీ గోల్డెన్ లెగ్ గురించి కోడై కూస్తోంది.

మీరు ఆయ‌న‌తో ఉండాల‌ని వేరే వైపు రావ‌ద్దు..అక్క‌డే ఉండండి. మీది గోల్డెన్ లెగ్‌. అందుకే వైఎస్‌ ను పైకి పంపించారు`` అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీంతో తీవ్రంగా ఆవేద‌న చెందిన `నేనేమైనా ద‌గ్గ‌రుండి పైకి పంపించానా? ఇలా మాట్లాడ‌టం ఏంటి. నువ్వు ఏమైనా ప‌క్క‌న ఉండి ప‌క్క‌లు వేస్తున్నావా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు? ` అంటూ అన‌డంతో `నీ ప‌ళ్లు రాలిపోతాయి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను ఏమైనా అన్నావంటే`` అంటూ విరుచుకుప‌డ్డారు. దీంతో ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ `రా...ఎవ‌రివి రాలుతాయో చూద్దాం` అంటూ ఘాటు స‌మాధానం ఇచ్చారు. `ఏం మాట్లాడుతున్నావు? ఎమ్మెల్యేవా నువ్వు ?  కామ‌న్స్ సెన్స్ ఉందా?  నువ్వు హీరోయిన్‌ గా స్ట్రెయిట్ గా వ‌చ్చావా?` అంటూ గ‌ణేష్ మ‌రో అంశంపైకి త‌న వాదాన్ని మ‌ళ్లించారు.

Tags:    
  • Roja 
  • Bandla Ganesh 
  • Andhra Politics 
  • Pawan kalyan 
  • Jagan 
  • TElugu NEWs 

Similar News

సోనియా ఆత్మ‌కథ‌: జ‌నాల్లో క్రేజ్ ఎలా ఉందంటే!

2026-11-11 18:30 GMT

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

Copyright @2026

Powered by Blink CMS