• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘‘వైఎస్ నిజంగా మగాడే’’.....

‘‘వైఎస్ నిజంగా మగాడే’’.. ఈ మాట అన్నది..

By - Tupaki Desk
Update: 2017-02-12 04:45 GMT
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటరీ సమావేశానికి ఆహ్వానాలు పంపిన ఏపీ సర్కారు.. ఆ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను అదుపులోకి తీసకెళ్లిన వివాదాస్పద అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మహిళా ఎమ్మెల్యేను అనుమానంతో అదుపులోకి తీసుకోవటం.. ఆమెకున్న గన్ మెన్ ను అనుమతించకుండా పోలీసు బలగాలతో తీసుకెళ్లిపోవటం.. ఎక్కడకు తీసుకెళుతున్నారో కూడా ముందస్తుసమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లటం లాంటివి చూస్తున్నప్పుడు ఏపీలో ప్రభుత్వం ఉందా? అన్న భావన కలగక మానదు.

నిజంగానే రోజా ఏదో చేయాలన్న ఆలోచనలో ఉందనే అనుకుందాం. అలాంటి ప్రయత్నం చేస్తే.. అడ్డుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలే కానీ.. తమకేదో సమాచారం వచ్చిందంటూ సరైన ఆధారాలు ఏమీ చూపించకుండానే అదుపులోకి తీసుకోవటం సరైన పని కాదన్న మాట వినిపిస్తోంది. తనకు జరిగిన అవమానంపై రోజా రియాక్ట్ అవుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. అప్పటి అధికారపక్షంలో ఉన్న వైఎస్ తన పట్ల వ్యవహరించిన వైనం గురించి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రతిపక్ష పార్టీలో ఉన్నానని.. పలు సమస్యలపై ఇప్పటి మాదిరే అప్పుడూ గళం విప్పానని.. అయితే.. ఏ రోజూ వైఎస్ తనను అణగదొక్కాలని ఆలోచించలేదన్నారు. ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజంగా మగాడే. ఆ విషయం గట్టిగా చెప్పగలను. సమస్యలపై విమర్శలు చేస్తే.. నన్ను మహిళా నాయకురాలిగానే చూశారే కానీ.. ఈ తరహాలో వ్యవహరించలేదు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నా చేత పదేళ్లు పార్టీలో గాడిద చాకిరి చేయించుకున్నారు. గర్భిణిగా ఉండి కూడా ఎన్నికల్లో ప్రచారం చేశా. నేను ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ తరఫున ఒక్క పైసా ఇవ్వలేదు. రెడ్డి కులస్తురాలినని ఓడించిన నీచమైన బుద్ధివాళ్లది.నేనుచేసిన కష్టాన్ని కూడా గుర్తించకుండా ఓడించారు. చంద్రబాబుకు సెంటిమెంట్లు అస్సలు ఉండవు’’ అని చెప్పుకొచ్చారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా  ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ తరఫున పూర్తిగా స్థాయిలో ప్రత్యర్థిపైనా విరుచుకుపడటంలో రోజా ఏమాత్రం వెనుకాడలేదని చెప్పాలి. ఈ లెక్కన రోజా.. టీడీపీలో ఉన్నప్పుడు ఆమె ఇబ్బందుల్ని తీర్చటంలో చంద్రబాబు విఫలం కావటమే కాదు.. ప్రత్యర్థిగా ఉన్న వేళ.. హుందాగా వ్యవహరించటంలోనూ బాబు తప్పు చేశారన్న మాట వినిపిస్తోంది.
Tags:    
  • Roja 
  • YSR Reddy 
  • Telugu News 
  • YSRCP 
  • Chandrababu naidu 
  • AP Politics 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS