బాబు చూడాల్సిన వీడియోల లెక్క చెప్పిన రోజా
ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కు తగ్గట్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాటలు వాడీవేడిగా ఉంటాయి. ఆమె నోటి నుంచి వచ్చే మాటలు బుల్లెట్ల మాదిరి ప్రత్యర్థుల్ని తాకుతుంటాయి. తడబాటు లేకుండా.. నాన్ స్టాప్ గా ఆమె చెప్పే మాటలు ఆమె ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. నందిగామ దగ్గర చోటు చేసుకున్న బస్సు ప్రమాదం నేపథ్యంలో.. జగన్ తీరుకు సంబంధించిన వీడియోల్ని ఏపీ క్యాబినెట్ లో చూశామన్న అంశంపై రోజా స్పందించారు.
క్యాబినెట్ సమావేశాల్లో వీడియోలు చూడటానికి.. అదేమైనా సినిమా థియేటరా? అంటూ మండిపడిన ఆమె.. బాబు చూడాల్సిన వీడియోలుచాలానే ఉన్నాయంటూ చిట్టా విప్పారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. ఆమె వాదన విన్నాక.. నిజమే కదా.. ఈ వీడియోల్ని బాబు చూడాల్సిన అవసరం ఉంది. మరీ వీడియోల్ని ఆయన చూశారా? లేదా? అన్న డౌట్ రాక మానదు. రోజా విప్పిన చిట్టాలో బాబు చూడాల్సిన వీడియోల వివరాలు చూస్తే..
1. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని దౌర్భాగ్యమైన పని.. రేవంత్ రెడ్డిని పంపి ఎమ్మెల్సీ సీటు కొనుగోలుకు రూ.5కోట్లు ఇస్తూ పట్టుబడిన వీడియో
2. మా వాళ్లు.. ‘దే బ్రీఫ్ డ్ మీ’ అంటూ అడ్డమైన ఇంగ్లిష్ లో మాట్లాడిన వీడియో
3. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో 29 మరణించిన వీడియో
4. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగడాల్ని అడ్డుకున్న మహిళా అధికారి వనజాక్షిని ఎలా కొట్టారో చూపే వీడియో
5. జానీమూన్ అనే మహిళను తన కుటుంబానికి మంత్రి రావెలతో ప్రాణహాని ఉందంటూ భోరుమన్న వీడియో
బాబు చూడాల్సిన వీడియోల చిట్టా చెప్పిన రోజా.. సీఎం తీరును తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. విపక్ష నేత జగన్ పై తీర్మానం చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి.. బస్సు ప్రమాదంలోమరణించిన ప్రయాణికుకు నష్టపరిహారం ఇప్పించాలని మాత్రం ఎందుకుతీర్మానం చేయలేదని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐఏఎస్ అదికారులు తీర్మానం చేసి మరీ సీఎంకు ఇచ్చారని.. రాస్ట్రంలోనే అత్యున్నత అధికారి అజయ్ కల్లంకు జరిగిన అవమానం వారికి కనిపించలేదా? అని ప్రశ్నించారు.
కలెక్టర్ చేతిలో నుంచి ఎమ్మెల్యే రామకృష్ణ పేపర్లు లాక్కొని చించివేసినప్పుడు ఐఏఎస్ సంఘాలు ఎందుకు స్పందించలేదని.. అప్పుడు ఎందుకు తీర్మానం చేయలేదన్న రోజా.. జగన్ నిత్యం ప్రజల్లో ఉంటూ.. ఏనాడు అధికారుల్ని పన్నెత్తి మాట అనలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే.. దరుసుగా ప్రవర్తిస్తే ఎవరికైనా కోపం రాదా? అని అడిగారు. బస్సు ప్రమాదం జరిగిన దానికి పక్కనే హెలికాఫ్టర్ లో తిరుగుతున్న సీఎం కానీ.. రవాణా మంత్రి కానీ.. మంత్రులు దేవినేని.. కామినేనిలు ఎవరూ ఎందుకు వెళ్లలేదన్న ఆమె.. డాక్టర్ పోస్ట్ మార్టం చేయలేదని చెబుతుంటే.. కలెక్టర్ మాత్రం చేశామని చెప్పారని.. ఇప్పుడు ఆరోపణలు చేయటం అర్థం లేదన్నారు.
బస్సు ప్రమాద ఘటనలో మరణించిన డ్రైవర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయకుండా ఎలా పంపించారో చెప్పాలన్న రోజా..రెండో డ్రైవర్ మృతదేహాన్ని ఎక్కడ దాచారో చెప్పాలని ప్రశ్నించారు. లోకేశ్ కు అండగా ఉన్నాడని బుద్దా మురళిని కాపాడారని.. లోకేశ్ కొడుకును ఎత్తుకొని ముద్దాడినంత మాత్రాన జేసీ దివాకర్ రెడ్డిని కాపాడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వానికి నష్టం చేస్తుందని తెలిసి కూడా.. కేశినేని.. దివాకర్ ట్రావెల్స్ ను కాపాడుతున్నారంటూ తప్పుపట్టారు. బార్ లో కల్తీ మద్యం ఉందని మల్లాది విష్ణుకు చెందిన బార్ మీద కేసు పెట్టినప్పుడు యజమాని మీద కేసుపెట్టారని.. అదే రీతిలో ఇప్పుడు దివాకర్ ట్రావెల్స్ యజమాని మీద ఎందుకు కేసులు పెట్టరంటూ రోజా నిలదీశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/