బావ - బామ్మర్ది పై ఫైర్ అయిన ఫైర్ బ్రాండ్!
వైసీపీ నగరి ఎమ్మెల్యే - ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా - హిందూపురం ఎమ్మెల్యే - టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ - ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై మరోసారి తనదైన మాటలతో రెచ్చిపోయారు. ఇటీవల హిందూపురం పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే బాలకృష్ణకు సీమ ఉద్యమకారుల నుండి చేదు అనుభవం ఎదురైంది. మీరు సీమా ఎమ్మెల్యే గా ఉంటూ సీమకి అభివృద్ధి జరగకుండా చూస్తున్నారంటూ - మూడు రాజధానులను వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ ఆయన వాహనాన్ని చుట్టుముట్టి ముందుకు కదలనివ్వలేదు. ఆ తరువాత పోలీసులు వారికీ సర్దిచెప్పి - పక్కకి పంపిన తరువాత ఎమ్మెల్యే బాలకృష్ణ అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఈ విషయంపై ఆ తరువాత బాలకృష్ణ ఓ చానల్ తో మాట్లాడుతూ ... నా క్యాన్వాయ్ ని ఆపిన సమయంలో నేను ఒక సైగ చేసి ఉంటే గనుక ఏమయ్యేదో అని రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రోజా కౌంటర్ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వియ్యంకుడైన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని చెప్పారు. చంద్రబాబు కి బుద్ది చెప్పకుండా సైలెంట్ గా ఉంటె ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని అన్నారు. రాయలసీమ నుంచి చంద్రబాబు - బాలకృష్ణలను తరిమికొట్టే రోజు అతి త్వరలోనే వస్తుందని ఆమె మండిపడ్డారు.
అలాగే పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా ఒట్టి దద్దమ్మలను తీసుకొచ్చారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం మండలిలో మొత్తం చంద్రబాబుకి భజన చేసేవారే ఉన్నారని - వారు మండలిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని తేల్చి చెప్పారు. భవిష్యత్ లో కూడా లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేరని - అతని భవిష్యత్ రాజకీయ సమాధి అవుతుందని రోజా జోష్యం చెప్పారు. కొడుకు రాజకీయ జీవితం సమాధి అవుతుందనే భయంతోనే మండలి రద్దుకి బాబు అడ్డుచెప్తున్నాడని తెలిపారు. మొత్తంగా ఒకేసారి బావ - బామ్మర్ది పై తనదైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే రోజా.