మళ్లీ సుప్రీంకోర్టుకు రోజా!​

Update: 2016-03-29 06:41 GMT
ఏపీ అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురయిన వైసీపీ ఎమ్మెల్యే రోజా తన పోరాటాన్ని ఆపలేదు. తాజాగా ఆమె మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఆమె సస్పెన్షన్ ను సమర్ధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
    
గత డిసెంబరులో జరిగిన సమావేశాల్లో రోజా అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారన్న కారణంతో ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు. దాన్ని హైకోర్టులో ఆమె సవాల్ చేయగా సింగిల్ జడ్జి బెంచి ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ... అసెంబ్లీలో స్పీకర్ ఆ ఆదేశాలను పాటించలేదు. అసెంబ్లీ కార్యదర్శి ఆ తీర్పును మళ్లీ హైకోర్టులో సవాల్ చేయగా ఈసారి ద్విసభ్య ధర్మాసనం ఆ కేసును విని సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసింది. దీంతో రోజాకు చుక్కెదురైనట్లయింది. అనంతరం కొద్ది రోజులుగా కామ్ గా ఉన్న రోజా దీనిపై న్యాయపరంగా ఎలా ముందుకెళ్లొచ్చన్న విషయంలో న్యాయవాదులతో సమాలోచనలు జరిపి చివరకు సుప్రీంలో సవాల్ చేశారు. ఆమె పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.
Tags:    

Similar News