వారికి.. బాబును కలవటం చాలా కష్టంగా ఉందట

Update: 2015-07-29 05:22 GMT
సీనియర్ల అకృత్యాలతో.. ఆత్మహత్య చేసుకున్న నాగార్జునయూనివర్సిటీ విద్యార్థిని రితేశ్వరి వ్యవహారం తెలుగుదేశం ప్రభుత్వ పరపతిని దెబ్బ తీస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి గంటా కలుగజేసుకున్నప్పటికీ.. చర్యల విషయంలో కఠినంగా వ్యవహరించలేదన్న విమర్శలు ఉన్నాయి.

మరోవైపు.. బాధితురాలి తల్లిదండ్రులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. దోషుల్ని కఠినంగా శిక్షించటంతోపాటు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే.. చంద్రబాబు అపాయింట్ మెంట్ దొరకటం లేదని వారు వాపోతున్నారు. ఘటన ఏం జరిగినా.. వారికి అందుబాటులో ఉంటూ.. బాధితులను కలిసి ఓదార్చే చంద్రబాబు.. రితేశ్వరి ఆత్మహత్యపై ఇప్పటివరకూ స్పందించలేకపోవటాన్ని ఎత్తి చూపిస్తున్నారు.

వీటన్నింటికి మించి.. బాధితురాలి తల్లిదండ్రులు కలిసి తమ వేదనను పంచుకోవాలని అనుకుంటున్నా.. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ దొరక్కపోవటం పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. రితేశ్వరి ఆత్మహత్య విషయంలో జరిగిన వాస్తవాల్ని వెల్లడించేందుకు ప్రయత్నించిన అధ్యాపకుల్ని సస్పెండ్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ఏపీ సర్కారు పరపతిని దెబ్బ తీసేలా ఉన్న రితేశ్వరి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News