టీకాంగ్రెస్ కు ఉన్న ఏకైక ఆప్షన్ రేవంత్ రెడ్డియేనా?
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. ప్రధాన ప్రతిపక్షం ముచ్చటగా మూడోస్థానానికి పడిపోవడం.. డిపాజిట్ కూడా గల్లంతు కావడం చూశాక కేడర్‌లో కొత్త చర్చ మొదలైంది. ఖచ్చితంగా పీసీసీ చీఫ్ ను మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. పార్టీ నాయకత్వం సైతం దుబ్బాక ఫలితం చూశాక.. ఇదే యోచిస్తోందని చర్చ జరుగుతోంది.
దుబ్బాకలో బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు హోరాహోరీగా తలపడ్డారు. అధికార టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగరెడ్డి భార్య సోలిపేట సుజాతపై 1,075 ఓట్ల మెజారిటీతో అపూర్వమైన రీతిలో విజయం నమోదు చేశారు.
కానీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలలో మూడవ స్థానానికి పడిపోయింది. బిజెపి రఘునందన్ రావుకు 63,352 ఓట్లు రాగా, టిఆర్ఎస్ సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు సాధించారు. భారత ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 22,196 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కాంగ్రెస్ పేలవమైన పనితీరును ఈ ఎన్నికల్లో కనబరిచింది. తెలంగాణలో పీసీసీ చీఫ్ ను మార్చాల్సిన ఆవశ్యకతను పార్టీ నాయకత్వానికి ఈ ఎన్నిక కలిగించింది.. 2017 అక్టోబర్‌లో పార్టీలో చేరిన ఫైర్‌బ్రాండ్ నాయకుడు ఎ. రేవంత్ రెడ్డిని ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో నియమించాలని పార్టీ నాయకత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. కార్యకర్తల నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తోంది.
రేవంత్ రెడ్డి తప్ప కేసీఆర్ ను ఇంతలా ఢీకొట్టే నాయకుడు ఆ పార్టీలో కనిపించడం లేదని అంటున్నారు.. యువకుడు, డైనమిక్ నాయకుడు కావడంతో అతడే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మిగిలి ఉన్న చివరి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు.
కాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2015 లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బు ఇస్తూ "ఓటుకు నోటు" కేసులో అరెస్టు అయ్యాడు.. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు.
దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శనకు అనేక కారణాలు ఉండవచ్చు. కాని ఫలితాలకు పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.మరి ఈ ఓటమితోనైనా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ను మారుస్తారా? పగ్గాలు కొత్తవారికి ఇస్తారా? అన్నది వేచిచూడాలి.