రేవంత్ టార్గెట్ మామూలుగా లేదుగా!
కలలు అందరికి ఉంటాయి. అయితే.. కనే కలల్ని ఎప్పుడు బయటకు చెప్పాలి? అనే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కలల గురించి లక్ష్యాల్ని చెబితే కామెడీగా మారుతుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ పరిస్థితి. మంచి మాటకారి అయినప్పటికీ.. ఎప్పుడేం చేయాలి.. ఎలా చేయాలన్న విషయంపై స్పష్టత తగ్గినట్లుగా కనిపిస్తోంది.
ఆ మధ్యన అదే పనిగా సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి.. ఈ మధ్యన కాస్తంత కామ్ గా ఉంటున్నారు. ఇలాంటివేళ విలేకరులతో ప్రత్యేకంగా చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా తన మనసులోని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పీసీసీ వైఖరి పట్ల తాను అసంతృప్తితో ఉన్న వైనాన్ని బయటపెట్టిన ఆయన.. తనను సరిగా వాడుకోవటం లేదని.. రాష్ట్ర కాంగ్రెస్ టీం లీడర్ కు సరైన సలహాలు ఇచ్చేవారు లేరని చెప్పారు.
తన వర్కింగ్ స్టైల్ తెలిసి కూడా తనకు అవకాశం ఇవ్వటం లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేసిన రేవంత్.. తనకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చినా తీసుకోనని స్పష్టం చేశారు. తన లక్ష్యం సీఎం పదవేనని చెప్పి సంచలనం సృష్టించిన రేవంత్ మాటలు ఇప్పుడు కామెడీగా మారాయి. తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఆప్షన్ లేక కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ మొదట తన సత్తా చాటాలన్న విషయాన్ని వదిలేసి.. తాను చేపట్టాల్సిన సీఎం పదవి గురించి తన మనసులోని ఆరాటాన్ని చెప్పటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిన రేవంత్ కు సీఎం పదవి చేపట్టే అవకాశం రావటం అంత తేలికైన విషయం కాదు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందన్న విషయాన్ని పక్కన పెడితే.. కాంగ్రెస్ లో తాను తప్ప మరెవరికి లేనంత పట్టు సంపాదించటంపై దృష్టి పెట్టటం వదిలేసి.. సీఎం పదవే తన లక్ష్యమని చెప్పటంలో అర్థం లేదని చెప్పక తప్పదు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ ను ఎమ్మెల్యేగా గెలిచేందుకు సైతం కేసీఆర్ ఇష్టపడటం లేదని.. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. రేవంత్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయేలా వ్యూహం రచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. స్థానికంగా తన బలాన్ని పెంచుకోవటంతోపాటు.. ఒక వర్గాన్ని లీడ్ చేసే స్థాయికి రేవంత్ తొలుత చేరుకోవాలే తప్పించి.. సీఎం పదవి మాత్రమే తాను చేపడతాననంటూ బడాయి మాటల కారణంగా వచ్చే అవకాశాలు కూడా మిస్ అవుతాయని చెప్పక తప్పదు.
కాంగ్రెస్ లాంటి పార్టీలో చేరిన తర్వాత ఆశలు.. ఆకాంక్షల్ని మనసులో బలంగా అదిమి పెట్టుకోవాలే కానీ బాహాటంగా బయటకు చెబితే ప్రయోజనం ఉండదని.. ఫలితం రాదన్న విషయాన్ని రేవంత్ ఎలా మర్చిపోతున్నారు? ఓటుకు నోటు కేసులో తనను జైలుకు పంపిన కేసీఆర్ ను జైలుకు పంపుతానంటూ తొడ కొట్టి.. మీసం మెలేసి మరీ సవాలు విసిరిన రేవంత్.. ఆ దిశగా అడుగులు వేయటం వదిలేసి.. సీఎం పదవి తప్పించి మరే పదవి తనకు అక్కర్లేదని చెప్పటం చూస్తే.. పదవిని చేపట్టే సామర్థ్యాన్ని పెంచుకోవటం కంటే ఆశను అంతకంతకూ పెంచుకుంటున్నారని చెప్పక తప్పదు. ఈ తీరుతో మేలు కంటే ముప్పే ఎక్కువన్న విషయాన్ని రేవంత్ మర్చిపోతున్నారని చెప్పక తప్పదు.