• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  11 నెల్ల‌లోనే...

11 నెల్ల‌లోనే అధికారంలోకి: రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By - Tupaki Desk
Update: 2022-06-24 16:37 GMT
తొందరలోనే కాంగ్రెస్లోకి చేరికల తుఫాన్ రాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాబోయే 11 నెలల్లో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కర్కంగూడ జడ్పీటీసీ కాంతారావులు పార్టీలో చేరగా.. రేవంత్రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. పోడు భూముల్లో దుక్కి దున్ని.. సాగు చేసుకుంటున్న వారిని పోలీసులు అరెస్టులు చేసి హింసిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ ఎస్‌ ప్రభుత్వం ఆదివాసీలను చిన్నచూపు చూస్తోందన్నారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కర్కంగూడ జడ్పీటీసీ కాంతారావులు పార్టీలో చేరగా.. రేవంత్రెడ్డి వారికి కండువా కప్పి ఆహ్వానించారు.

వెంకటేశ్వర్లు, కాంతారావుల చేరికతో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 11 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలనూ కాంగ్రెస్ గెలుచుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ అమలైతే.. అన్నదాతల జీవితాలే మారిపోతాయని పేర్కొన్నారు.

అధికారం చేపట్టాక పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. తొందరలోనే అశ్వారావుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్న రేవంత్రెడ్డి.. కాంగ్రెస్లోకి చేరికల తుపాన్ రాబోతోందని స్పష్టం చేశారు.

పోడు భూములకు పట్టాలిస్తానని ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్.. ఆ హామీని పట్టించుకోవడం లేదు. వందల మంది ఆదివాసీలపై ఈ ప్రభుత్వం కేసులు పెట్టింది. గిరిజనుల భూములు లాక్కుని లే అవుట్లు చేస్తున్నారు. తాటి వెంకటేశ్వర్లు, కాంతారావుల చేరికతో కాంగ్రెస్ మరింత బలపడుతుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు పార్లమెంట్ సీట్లతో పాటు మొత్తం అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్వే. 11 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుంది. తొందరలోనే కాంగ్రెస్లోకి చేరికల తుపాన్ రాబోతుంది... అని రేవంత్ అన్నారు.
Tags:    
  • Telangana 
  • TPCC 
  • Revanthreddy 
  • Reavanthreddycongress 
  • telanganapolitics 
  • TRSparty 

Similar News

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

టాటా గ్రూప్‌లో ఏం జరుగుతోంది? జిమ్మీ టాటా లేఖతో కొత్త చర్చ

2026-11-17 10:03 GMT

‘‘అయ్యా మీ రూ.1000 తీసుకోండి’’.. బ్యాలెట్ బాక్స్‌లో నోట్లు, లేఖ వేసిన ఓటరు!

2026-11-17 10:02 GMT

100 మంది బౌన్సర్లు.. కరెన్సీ నోట్లతో స్వాగతం.. ఈ గుర్రం రాచరికం వెనుక అసలు కథ

2026-11-17 10:01 GMT

డర్టీ బాంబ్‌.. పేలుడు కంటే రేడియేషన్‌తోనే ఎక్కువ ముప్పు!

2026-11-17 10:01 GMT

1.8 లక్షల మంది కోరుతున్నా.. జెన్సన్ హువాంగ్‌ను వెనక్కి తీసుకోని ఎన్విడియా!

2026-11-17 10:01 GMT

యూట్యూబర్ ను సెల్ఫీ పేరుతో దగ్గరకొచ్చి ఏకంగా 'లిప్ కిస్' అడిగాడు.. తర్వాత చూడాలి..

2026-11-17 06:51 GMT

రోడ్లపై 'ఎర్ర' సముద్రం.. ఇదీ ప్రకృతి సృష్టిస్తున్న అద్భుత దృశ్యం

2026-11-17 05:35 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

ఆస్ట్రేలియాలో చదువుతున్న వారికి కొత్త తలనొప్పి.. కుటుంబ సభ్యుల వీసాపై మారిన రూల్స్!

2026-11-17 04:41 GMT

విజయ్ కు అందలం.. సీఎంలు రేవంత్, డీకే, సతీషన్ కు మంగళం.. ఇలా చేస్తే కాంగ్రెస్ ను అనరా మరీ..

2026-11-17 04:40 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

Copyright @2026

Powered by Blink CMS