ఒక్క బీర్ తాగి పొరపాటున 5 వేల డాలర్ల టిప్ ఇచ్చాడు.. ఆ తర్వాత ఏమైందంటే!!
ఆన్ లైన్ పేమెంట్స్ వచ్చిన తర్వాత కొన్ని సార్లు తప్పులు దొర్లడం.. తద్వారా వందలకు బదులు వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ అవ్వడం లేదంటే వేలు చేయాలనుకున్న సమయంలో వందలే ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. తక్కువ వెళ్తే సమస్య ఏమీ లేదు. మళ్లీ చేసుకోవచ్చు. కాని ఎక్కువ చేసిన సమయంలోనే కాస్త ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా ఏదైనా బయట ప్రదేశంలో లేదంటే బయట వ్యక్తులకు పొరపాటున ఎక్కువ మొత్తం కొట్టేస్తే పెద్ద సమస్య తప్పదు.
ఇటీవల అమెరికా కు చెందిన డేవిడ్ హౌస్ అనే వ్యక్తి 5 డాలర్లు పేమెంట్ చేయాలనుకుని ఏకంగా 5 వేల డార్లు పే చేశాడు. ఆ విషయాన్ని అతడు మూడు రోజుల తర్వాత చూసుకున్నాడు. తన 5 వేల డాలర్లు ఎలా తగ్గాయా అని ఆలోచించుకున్న సమయంలో ఆనియెల్ ఆర్టిజ్ బార్ లో తాను బీరు తాగి బిల్లు చెల్లించి వెయిటర్ కు టిప్పుగా 5 డాలర్లు ఇవ్వాలనుకుని పొరపాటున 5 వేల డాలర్ల ను కొట్టినట్లుగా గుర్తుకు వచ్చింది. దాంతో వెంటనే ఆ బార్ కు వెళ్లాడు.
డేవిడ్ వెళ్లి విషయం చెప్పిన వెంటనే తప్పు జరిగిన మాట వాస్తవమే.. అప్పటి నుండి కూడా తాము మీ అడ్రస్ కోసం వెదుకుతున్నామంటూ బార్ యాజమాన్యం డేవిడ్ తో అన్నారట. పొరపాటున వచ్చిన 5 వేల డాలర్లను డేవిడ్ అకౌంట్ కు కొట్టడం జరిగిందట. ఆ తర్వాత డేవిడ్ తిరిగి వెయిటర్ కు ఈసారి పది డాలర్ల టిప్పును అకౌంట్ నుండి కొట్టాడట. ఆ వెయిటర్ తన టిప్పు ఖాతాలో ఎక్కువ మొత్తం ఉండటం చూసి యాజమాన్యంకు చెప్పడంతో వారు డేవిడ్ అడ్రస్ కోసం వెదకడం ప్రారంభించారట. అయితే డేవిడ్ వచ్చేయడంతో వెంటనే ఆయన డబ్బును ఇచ్చేశారు.