రేణు ఫైరింగ్.. ఈసారి ఎవరి మీదంటే..?
పవన్ మాజీ సతీమణి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఇటీవల పవన్ ఫ్యాన్స్ మీద విపరీతమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఇమేజ్ పైన ఆమె రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఇమేజ్ తప్పని చెప్పాలంటూ తనను పవన్ అభిమానుల నుంచి మెసేజ్ లు వెళ్లటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన తప్పు లేకున్నా కొందరు వ్యక్తులు తనను ఐదేళ్లుగా నిందిస్తున్నారో.. వారంతా తనను సైలెంట్ గా ఉండమన్నారని.. తన ఆత్మాభిమానం కాపాడుకోవటానికి ఏదైనా మాట్లాడితే.. ఫ్రీ పబ్లిసిటీ కోసం మాట్లాడినట్లు నిందిస్తున్నారన్నారు. పవన్‌కు వ్యతిరేకంగా ఒక స్టుపిడ్‌రాజకీయపార్టీ ఒకటి.. ఒక ఇమేజ్ ను సర్క్యులేట్ చేస్తే.. దాని గురించి నన్ను మాట్లాడమని కొందరు సభ్యత లేకుండా అడుగుతున్నారన్నారు.
కొందరు అర్థిస్తున్నారు.. మరికొందరు భయపెడుతున్నారు. ఇంకొందరు మంచిగా.. ఆ మాటల్ని ఖండించమని అడుగుతున్నారని.. వారికారణంగా తన ఇన్ బాక్స్ నిండిపోతుందన్నారు. పవన్ కు తనకు మధ్య రూల్స్ ఎలా మారతాయన్న రేణూ.. ఐదేళ్లుగా తన తప్పు లేకున్నా నిందలు పడుతున్నానని.. అప్పట్లో ఆత్మాభిమానం ముఖ్యమని అనిపించలేదా? అంటూ ప్రశ్నించారు.
కల్యాణ్ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లితే తాను వచ్చి వాటిని సరి చేయాలనుకోవటం ఏమిటంటూ ఆమె నిలదీశారు. తనకు తాను ఎప్పుడూ పవన్ ను పబ్లిక్ గా నిందించనని..తన పిల్లల తండ్రి గురించి చెడ్డగా మాట్లాడమని ఏ రాజకీయ పార్టీ తనను ప్రభావితం చేయలేదని తేల్చి చెప్పిన రేణూ.. ఈసారి కల్యాణ్ ప్రత్యర్థి పార్టీతో పాటు.. పవన్ ఫ్యాన్స్ ను తప్పుపట్టటం గమనార్హం. చూస్తుంటే.. పవన్ ఫ్యాన్స్ రేణూను వదిలేటట్లు లేరే?