రీల్ కథ మాదిరి పగబట్టిన పాము.. చిన్నారి మృతి.. ఇద్దరు ఆసుపత్రిలో

Update: 2021-11-07 23:30 GMT
పాము పగబట్టటం.. ఒకరి తర్వాత ఒకరిని కాటేయటం లాంటి కాన్సెప్టుతో చాలానే సినిమాలు చూసి ఉంటాం. రీల్ లో మాదిరే రియల్ గా కూడా ఒక పాము ఒక కుటుంబాన్ని పగబట్టినరీతిలో వ్యవహరించిన పాము కారణంగా చిన్నారి ఒకరు మృత్యువాత పడగా.. ఇంటి పెద్దలు ఇద్దరిని కూడా పాము కాటేయటంతో వారి పరిస్థితి ఇప్పుడు సీరియస్ గా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలేం జరిగిందంటే..

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో శనిగపురంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారటమే కాదు.. తాజాగా భయాందోళనలకు గురవుతున్నారు. రాత్రివేళ ఇంట్లో నిద్ర పోతున్న వేళ క్రాంతి.. మమత దంపతులతో పాటు మూడు నెలల చిన్నారితో కలిసి నిద్రపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ. నిద్రపోతున్న దంపతులను కాటేసింది.

పామును గుర్తించిన దంపతులు పెద్ద ఎత్తున అరుపులు అరవటంతో స్థానికులు వెంటనే రియాక్టు అయ్యారు. వెంటనే వెతికి పామును పట్టుకున్నారు. అదే సమయంలో ముగ్గురిని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కాటేసిన పామును స్థానికులు పట్టుకున్నారు. విషపూరిత పాము కావటంతో చిన్నారిని కరిచిన వెంటనే మరణించినట్లు చెబుతున్నారు. దీంతో.. పెద్ద వాళ్లకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం పరిస్థితి ఇంకా స్థిమిత పడలేదని.. మరికొంత సమయం తీసుకుంటారని చెబుతున్నారు.
Tags:    

Similar News