జగన్ టూర్ క్యాన్సిల్!... అసలు కారణమిదే!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన రద్దు వెనుక కారణం ఏమిటా? అంటూ మొన్నటి నుంచి రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఆ విశ్లేషణలన్నీ కూడా నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. పరీక్షల్లో నిమగ్నమైన కూతురును ఇబ్బంది పెట్టడం ఎందుకన్న దిశగా ఆలోచించిన జగన్... తన లండన్ టూర్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ చేపట్టిన యాత్ర దాదాపుగా 14 నెలల పాటు కొనసాగింది. సీబీఐ కేసుల విచారణ కోసం వారానికి ఓ సారి హైదరాబాదుకు వెళ్లిరావడం మినహా ఈ 14 నెలల కాలంలో సొంతూరుకు కూడా వెళ్లని జగన్... లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో విద్యనభ్యసిస్తున్న కూతురును కూడా చూడలేదనే చెప్పాలి. విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో జరిగిన దాడి సమయంలో ఓ వారం పాటు రెస్ట్ తీసుకున్న జగన్... పాదయాత్ర ముగిసేదాకా కుటుంబానికి దూరంగానే గడిపారు. పాదయాత్ర ముగిసిన తర్వాత కూతురును చూడాలన్న కోరకతో ఓ 5 రోజుల పాటు లండన్ టూర్ ను ఆయన ప్లాన్ చేసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి జగన్ లండన్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. టూర్ లో 5 రోజుల పాటు లండన్ లో కూతురువర్షను చూడటంతో పాటుగా అక్కడే ఓ 5 రోజుల సరదాగా గడపడం ద్వారా... పాదయాత్రో ఎదుర్కొన్న ఒత్తడి నుంచి ఉపశమనం పొందాలని జగన్ భావించారు. అయితే... ఇదే సమయంలో కూతురుకు పరీక్షల షెడ్యూల్ విడుదల కావడం, వాటికి ప్రిపేర్ అయ్యే క్రమంలో తనకోసం వచ్చే కటుంబానికి సమయం కేటాయించడం జగన్ కూతురు వర్షకు కుదరలేదట. ఇదే విషయాన్ని తండ్రికి తెలపిన వర్ష... ఎగ్జామ్స్ పూర్తి అయ్యాక వస్తే బాగుంటుందని చెప్పిందట. అదే సమయంలో జగన్ కూడా పరీక్షలకు సిద్ధమవుతున్న కూతురు విలువైన సమయాన్ని వృథా చేయడం ఇష్టం లేకనే అప్పటికప్పుడు తన పర్యటనను వాయిదా వేసుకున్నారట. వర్ష పరీక్షలు పూర్తి కాగానే... కాస్తంత తీరికగా జగన్ మరోమారు తన లండన్ టూర్ ను రీషెడ్యూల్ చేసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Full View