లోకేష్‌ మంగళగిరినే ఎందుకు ఎంచుకున్నాడు.?

Update: 2019-03-14 06:04 GMT
చంద్రబాబు తనయుడు - ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ మంగళగిరి నుంచి పోటీ చేస్తాడని టీడీపీ అధిష్టానం కన్‌ ఫర్మ్ చేసేసింది. మొదటగా విశాఖ - భీమిలి అని రకరకాల పేర్లు వచ్చినా ఫైనల్‌ గా మంగళగిరినే సెలెక్ట్‌ చేశారు చంద్రబాబు. సీఆర్‌ డీఏ పరిధిలో ఎక్కువ గ్రామాలు మంగళగిరిలోనే రావడం.. అక్కడ టీడీపీ చేసిన అభివృద్ధిని చూసి లోకేష్‌ కు అందరూ ఏకమొత్తంగా ఓట్లు వేస్తారని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే.. ఇక్కడే అసలు లాజిక్‌ ఉంది.

టీడీపీకి అసలు మంగళగిరి అనేది అంత సేఫ్‌ కాదు. ఎందుకంటే.. అక్కడ బీసీ ఓటర్లు ఎక్కువ. బీసీ ఓటర్లంతా మొదటినుంచి కమ్యూనిస్టుల వైపు ఉన్నారు. కాంగ్రెస్‌ కానీ - టీడీపీ కానీ గతంలో మంగళగిరి సీటు గెలిచాయంటే అదంతా కమ్యూనిస్టులతో పొత్తుల వల్లే. కానీ ఇప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు జనసేనతో ఉంది. ఇప్పుడు జనసేన తరపున ఎవరైనా మంగళగిరిలో నామినేషన్‌ వేస్తే.. వాళ్లు కచ్చితంగా ఓట్లు చీలుస్తారు. ఆలరెడీ ఈ మేరకు జనసేకు - టీడీపీ ఒప్పందం జరిగింది అనేది కూడా బయట విన్పిస్తున్నమాట. టీడీపీ ఓట్లు ఏటూ టీడీపీకే పడతాయి. అప్పుడు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఓటింగ్‌ శాతం పడిపోతుంది. లోకేష్‌ అటోమేటిగ్గా గెలుస్తాడు. ఇదీ టీడీపీ లెక్క. అన్నింటికి మించి టీడీపీ ప్రభుత్వానికి పక్కెలో బళ్లెంలా తయారైన ఆర్కేకు కూడా ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లు అవుతుంది. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. మరోవైపు.. లోకేష్‌ కు ప్రత్యక్ష రాజకీయాల్లో రాణించలేడు అనే విమర్శలకు కూడా ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లు అవుతుంది. అందుకే చంద్రబాబు తెలివిగా లోకేష్‌ మంగళగిరి నుంచి బరిలోకి దింపారని విశ్లేషకులు అంచనా.
Tags:    

Similar News