• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అజిత్ పవార్ వెన్నుపోటు...

అజిత్ పవార్ వెన్నుపోటు వెనుక అసలు కథ ఇదేనా?

By - Tupaki Desk
Update: 2019-11-24 14:30 GMT
నేషనలిస్ట్  కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌కు ఢోకా ఇస్తూ అజిత్ పవార్ బీజేపీకి జైకొట్టడం వెనుక అసలు కారణం పుత్ర ప్రేమని తెలుస్తోంది. పవార్ కుటుంబం నుంచే కొత్త వ్యక్తుల ప్రాబల్యం పెరుగుతుండడంతో తనకు, తన కుమారుడికి భవిష్యత్తులో ప్రయారిటీ తగ్గుతుందన్న ఆందోళనతో ఆయన ఈ స్టెప్ వేశారన్న ప్రచారం ఒకటి మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

శరద్ పవార్‌కు స్వయానా అన్న కొడుకు అజిత్ పవార్. శరద్ పవార్‌కు కొడుకులు లేరు. కుమార్తె సుప్రియా సూలె రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆమె ఎంపీగా ఎక్కువగా దిల్లీకే పరిమితమయ్యారు. పైగా ఆమె కుటుంబం కూడా సింగపూర్‌లో స్థిరపడింది. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని కూడా శరద్ పవారే స్వయంగా పలుమార్లు చెప్పారు. దాంతో శరద్ పవార్ తరువాత అజితే ఆ పార్టీలో పవర్ సెంటర్‌గా ఉండేవారు. గత 30 ఏళ్లుగా శరద్ పవార్‌కు వెన్నంటే ఉంటూ అజిత్ పార్టీని చూసుకున్నారు. శరద్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్నా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అజిత్ పనిచేశారు. దాంతో శరద్ రాజకీయ వారసుడు అజితేనని అంతా అనుకునేవారు.  అయితే ఇటీవల శరద్‌ రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెబుతున్న సమయంలోనే సుప్రియా సూలే చురుగ్గా వ్యవహరించడం మొదలుపెట్టారు. అంతేకాదు... సుప్రియా చొరవతో శరద్ మరో అన్న అప్పా సాహెబ్ కొడుకు రాజేంద్ర పవార్ కుమారుడు రోహిత్‌ రాజకీయాల్లోకి వచ్చారు.

అజిత్ కుమారుడు పార్థ పవార్ మొన్నటి ఎన్నికల్లో మావల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే తొలుత పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. చివరకు అజిత్ పట్టుపట్టడంతో టికెట్ ఇచ్చారు. అదసమయంలో రోహిత్ పవార్‌కు జామ్‌ఖేడ్‌ అసెంబ్లీ నుంచి టికెట్‌ ఇచ్చారు. అజిత్ కుమారుడు పార్థ ఓడిపోగా.. రోహిత్‌ గెలిచారు.

ఈ పరిణామాలన్నీ అజిత్ పవార్‌కు రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు రేపాయని చెబుతున్నారు. శరద్ పవార్ తదనంతరం తనతో పాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకూ ఇబ్బంది వస్తుందన్న ఆందోళనతో ఆయన పార్టీని చీల్చినట్లుగగా చెబుతున్నారు. సుప్రియ అండతో రోహిత్‌ రాష్ట్రరాజకీయాల్లో తనకు కూడా పోటీగా మారే ప్రమాదముందని ఆయన భావించడంతోనే వేరు కుంపటి పెట్టి బీజేపీతో కలిశారంటున్నారు.
Tags:    
  • Ajit pawar 
  • BackStabbing Episode 
  • Telugu News 

Similar News

అల్లూరులో చేతులు కలిపిన టీడీపీ, వైసీపీ.. రెండో విడత మున్సిపోల్స్ లో ఆసక్తికర పరిణామం

2026-11-15 09:45 GMT

యూపీలో యోగి కోసం ఒవైసీ.. ఉత్తరాది రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్

2026-11-15 09:41 GMT

సామాన్యుడికి బిగ్ రిలీఫ్: బియ్యం కొత్త ధరలు ఫిక్స్.. ఒక్క రూపాయి ఎక్కువ అమ్మితే అంతే!

2026-11-15 09:37 GMT

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

Copyright @2026

Powered by Blink CMS