భార్యలను పంచుకోవచ్చు.. వింత సంప్రదాయాలు

Update: 2020-11-27 02:30 GMT
ఒక్కరికి ఒక్కతే భార్య అన్నది భారతీయ సంప్రదాయం. మన శ్రీరాముడే ఆదర్శం. అయితే మన దేశంలోనూ మహారాభారతం చరిత్ర రిపీట్ అవుతున్న సందర్భాలున్నాయి. మహాభారతంలో ద్రౌపదిని పాండవులు పంచుకున్నది మన భారతదేశ సంప్రదాయమే.. అయితే తరువాత వివాహ వ్యవస్థపై నమ్మకం పెరిగి అదే చరిత్ర అయ్యింది.అయితే మన దేశంలోనే ఒకే భార్యను అన్నాదమ్ములందరూ పంచుకునే సంప్రదాయం ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని శివారు ప్రాంతాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

దీనికి కారణం ఉంది. ఉన్న కొంత భూమిని అన్నాదమ్ములు పంచుకుంటే తిండికి బతకడానికి కష్టమవుతుందని.. ఒకే భార్యను అన్నాదమ్ములందరూ చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ.. తరతరాలుగా ఇక్కడ అన్నాదమ్ములందరికీ ఒకే భార్య ఉంటూ వస్తోంది. అంతమందితో సంసారం చేయడం కష్టమైనా ఆ పడతులు భరిస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తుండడం విశేషం.
 
ఇలాంటి అపవిత్ర బంధాల వల్లే వివాహ వ్యవస్థలు పాశ్చాత్య దేశాల్లో బలహీనపడుతున్నాయి. మన సంప్రదాయం ప్రకారం ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే బంధాలు నిలబడుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News