యాదాద్రిలో రియల్ గోల్‌మాల్ .. రూ.700 కోట్ల బ్లాక్ మనీ !
తెలంగాణ రాష్ట్రంలో మరో అక్రమ రియల్ ఎస్టేట్ దందాల బాగోతం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వందల కోట్లు సంపాదించి, లెక్కల్లో చూపకుండా భారీగా బ్లాక్ మనీని పోగేసిన కంపెనీల అసలు స్వరూపం వెలుగులోకి వచ్చింది. రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఏకంగా రూ.700 కోట్ల అక్రమ లావాదేవీలు బట్టబయలు అయ్యాయి. గత ఆరేళ్లలో యాదాద్రి, భువనగిరిలో ఈ భూముల అక్రమ క్రయ విక్రయాలు జరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. మార్చి 23, 24 తేదీల్లో భువనగిరి, యాదగిరిగుట్ట పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి.
ఐటీ దాడులు చేసిన వాటిలో స్పెక్ట్రా, సన్ సిటీ సంస్థలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లోని ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేస్తే దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయట. స్పెక్ట్రా సంస్థ చైర్మన్ జగన్, సన్ సిటీ సంస్థ చైర్మన్ నారాయణగౌడ్ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లపై ఆదాయ పన్నుశాఖ అధికాుులు ఏకకాలంలో దాడులు చేశారు. స్పెక్ట్రాలో కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన కాంగ్రెస్ ఆలేరు ఇన్ చార్జి బీర్ల ఐలయ్య ఇంట్లోనూ సోదాలు జరిపారు. మొత్తంగా ఈ రెండు సంస్థల్లో కలిపి రూ.700 కోట్ల నలధనం గుర్తించారు. ఆ ఆదాయానికి సంబంధించి ఎలాంటి లెక్కలూ చూపలేదు.
ఇక, సోదాల అనంతరం ఆయా సంస్థల నుంచి కీలక పాత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు రూ.11.88 కోట్ల నగదు, రూ.1.98 కోట్లు విలువైన బంగారం ఆభరణాలను కూడా సీజ్ చేశారు. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు యాదగిరి గుట్టలో జరిపిన సోదాల్లో అనేక పత్రాలతో పాటు కంప్యూటర్లలో కీలక సమాచారాన్ని తీసుకున్నారు. భూములను రిజిస్ట్రేషన్ చేసిన విలువ కంటే ఎక్కువ నగదు స్వీకరించి..ఆ నగదుతో భూముల క్రయవిక్రయాలు జరిపారని సీబీడీటీ తెలిపింది. ఆ రూ.700 కోట్లకు సంబంధించి లెక్కలు చూపకుండా...ఉద్దేశ్యపూర్వకంగా పన్నును ఎగవేశారని స్పష్టం చేసింది. ఈ రెండు సంస్థ యాదగిరి గుట్ట ప్రాంతంలో పెద్ద ఎత్తున వెంచర్లు వేసి..అక్రమ లావాదేవీలు జరిపారని సీబీడీటీ వెల్లడించింది.