అమరావతి వల్లే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్.. నిజమేనా ?

Update: 2020-01-24 09:22 GMT
రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బాడీ క్రెడాయ్ జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 వరకు హైదరాబాద్ హైటెక్స్‌ లో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. డెవలపర్స్, రియాల్టర్స్, బిల్డింగ్ మెటీరియల్ తయారీ దారులు, కన్సల్టెంట్స్, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్స్ ఇందులో పాల్గొనబోతున్నాయి. హోమ్ బయ్యర్స్ తమకు సరైనదిగా భావించే ఇంటిని ఎంచుకోవడానికి, త్వరగా రుణం పొందడానికి క్రెడాయ్ హైదరాబాద్‌ ప్రాపర్టీ షో సరైన వేదిక కానుంది.

ఈ షో లో దాదాపు గా 15,000 ఇళ్లని వివిధ రియల్టీ కంపెనీలు సేల్‌ కు పెడుతున్నాయి. బ్యాంకులు, రియాల్టర్స్, ఫైనాన్షియల్ సంస్థలు దాదాపు 100 స్టాల్స్‌ ను ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే ఈ ప్రాపర్టీ షోకు 50 వేలకు మించి సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇది మూడు రోజుల ఈవెంట్ గా నిర్వహిస్తున్నారు. ఇకపోతే క్రెడాయ్‌ కు ఇది తొమ్మిదో ప్రాపర్టీ షో కావడం విశేషం. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు రామకృష్ణా రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

భాగ్యనగరంలో అమ్ముడుపోని ఫ్లాట్ల సంఖ్య పెద్దగా ఎక్కువగా లేదన్నారు. అమ్ముడుని కాని ఫ్లాట్లు ఎక్కువగా ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ఆర్థిక మాంద్యం నుంచి పాఠాలు నేర్చుకున్న నిర్మాణ సంస్థలు డిమాండును బట్టి కొత్త నిర్మాణాలు చేపడుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో అమ్ముడు కాని ఫ్లాట్లు మహా అయితే వెయ్యి వరకు ఉంటాయన్నారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త మున్సిపల్ చట్టం రియల్ ఎస్టేట్ రంగానికి ప్రయోజకరమన్నారు. గత అయిదేళ్లలో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్య వృద్ధిని సాధించిందని, రానున్న నాలుగైదేళ్లలోను ఇదే పెరుగుదల ఉంటుందని, ప్రధానంగా ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలో వృద్ధి, స్థిరమైన ప్రభుత్వం, ప్రభుత్వం చేపట్టిన విధానాలు ఇందుకు దోహదం చేశాయని అయన తెలిపారు.

గత అయిదేళ్ల నుంచి హైదరాబాద్ నిర్మాణ రంగం సరికొత్త రూపు సంతరించుకుందని, రెరా రాకతో అన్ని రకాల అనుమతులు ఉండి, నాణ్యమైన ప్రాజెక్టులను నిర్మించే డెవలపర్ల సంఖ్య పెరుగుతోందన్నారు. అమరావతి లో ఉద్రిక్తత ల కారణం గా హైదరాబాద్ రియల్ రంగం అభివృద్ధి చెందుతుందనేది అపోహ అన్నారు. సుస్థిర పాలన, సానుకూల వాతావరణం, పెట్టుబడులను ప్రోత్సహించే ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడి కోసం అనేక సంస్థలు ముందుకు వస్తాయన్నారు అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరాన్ని కేంద్రంగా మార్చుకుంటున్నాయని, భారీ గా కో-వర్కింగ్ స్పేస్‌ను ఏర్పాటు చేస్తున్నారన్నారు. నిపుణుల లభ్యత, ఉద్యోగావకాశాలు పెరగడం వంటి కారణాలతో ఇళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు. వచ్చే నాలుగైదేళ్ల లో మరిన్ని కొత్త ప్రాజెక్టులు వస్తాయని, ప్రతి ఏడాది నలభై వేల వరకు కొత్త ఇళ్లను నిర్మించే వీలు ఉందని తెలిపారు.


Tags:    

Similar News