• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మళ్లీ కోచ్ గానే...

మళ్లీ కోచ్ గానే కొనసాగనున్న రవిశాస్త్రి .

By - Tupaki Desk
Update: 2021-11-08 08:36 GMT
సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న సీఏసీ, ఏరికోరి రవిశాస్త్రిని టీమిండియా హెడ్‌ కోచ్‌ గా ఎంపిక చేసింది. రవిశాస్త్రికి ఏటా రూ.8 కోట్లు చెల్లిస్తోంది బీసీసీఐ. 2019 వన్డే వరల్డ్‌ కప్ టోర్నీకి ముందే 2019, జూన్ 13 నాటికి రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయితే వరల్డ్‌ కప్‌ ను దృష్టిలో పెట్టుకుని రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువును పొడగించింది బీసీసీఐ. 2019, ఆగస్టు 16న భారత సారథి విరాట్ కోహ్లీ సపోర్ట్‌ తో భారత హెడ్‌ కోచ్‌ గా తిరిగి నియమితుడయ్యాడు రవిశాస్త్రి. ఆ కాంట్రాక్ట్ గడువు 2021 ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్ టోర్నీతో ముగియనుంది.

ప్రధాన కోచ్ రవిశాస్త్రి అండ్ కో పదవీ కాలం నేటి భారత్-నమీబియా మ్యాచ్‌తో ముగిసిపోనుంది. ఆ తర్వాత రవి ఏం చేయబోతున్నారనే ఊహాగానాలకు సమాధానం దొరికేసింది. ఇప్పటి వరకు కోహ్లీసేనను నడిపించిన రవిశాస్త్రి ఇకపై ఐపీఎల్‌ జట్టును నడిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల పురుడుపోసుకున్న కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ యాజమాన్యం రవిశాస్త్రిని సంప్రదించినట్టు తెలుస్తోంది. రవిశాస్త్రిని మాత్రమే కాకుండా అతడి సహచరులైన బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్‌లను కూడా తీసుకోవాలని అహ్మదాబాద్ యాజమాన్యం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే ఈ డీల్‌పై రవి సంతకం చేస్తాడని కూడా చెబుతున్నారు. కాగా, క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రవిశాస్త్రి దశాబ్దానికిపైగా కామెంటేటర్‌గా పనిచేశాడు. సక్సెస్‌ఫుల్ కామెంటేటర్‌గా పేరుగాంచాడు. ఆ తర్వాత టీమిండియాకు రెండుసార్లు మొత్తంగా 15 ఏళ్లు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఇప్పుడు మరోమారు ఐపీఎల్ జట్టుకు కోచ్‌గా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.


Tags:    
  • Ravi Shastri 
  • latestnews 
  • laterst updates 
  • trending news 
  • Newstoday 
  • Trend News 

Similar News

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS