మతం మారిన ఎలుకలే విగ్రహం పడగొట్టేసింటాయి .. సాదినేని యామిని !

Update: 2021-01-05 10:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోన్న దేవాలయాలపై దాడులు, దేవతా మూర్తుల విధ్వంసాలపై బీజేపీ నేత  సాదినేని యామిని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం, విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని కోమాలమ్మ అమ్మవారి పాదముద్రలు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, తాజాగా విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహం ధ్వంసమైన ఘటనల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత సైతం ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు. ఒకదాని వెంట ఒకటిగా చోటు చేసుకుంటోన్న ఈ దాడుల పట్ల హిందువులందరూ మానసిక క్షోభకు గురవుతున్నారని అన్నారు. హిందూ ఆలయాలకు రక్షణ కల్పించాల్సిన దేవాదాయ శాఖ మంత్రి.. అన్యమత సభలకు వెళ్తుంటారని, హోం మంత్రి మేకతోటి సుచరిత ఒక మతానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.

విజయవాడలో బస్టాండ్ సమీపంలో ఉన్న రామాలయంలో సీతమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఎలుకలు పడేయడం వలనే విగ్రహం విరిగిపోయిందని సిఐ మాట్లాడిన మాటలకి కౌంటర్ గా  యామిని మాట్లాడుతూ యాభై ఏళ్లుగా ఏమీ చేయలేని ఎలుకలు హఠాత్తుగా విగ్రహాన్ని పడగొట్టాయంటే , ఖచ్చితంగా అవి నిన్నో మొన్నో మతం మారి ఉంటాయంటూ విమర్శలు కురిపించారు. అలాగే , పిల్లుల అండ చూసుకునే ఇలా చేసి ఉంటాయంటూ సాదినేని యామిని ఎలుకలు పడేయటం వల్ల విగ్రహం విరిగిపోయింది అన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

అలాగే నారాయణ చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడిన సాదినేని యామిని చైనాకి ఊడిగం చేస్తూ, హైందవాన్ని మాత్రమే చులకన చేసి నాశనం చేసే నారాయణ గారు, మీరు ఇంకా ఇలా పేట్రేగి వాగే ఆ నోరు పనిచేస్తుంది అంటే అది మా దేవుడు బిక్ష. హిందూ దేవుళ్లను బొమ్మ గిమ్మా అంటే పళ్ళు రాలగొడతారు హిందువులు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.  ఏదైనా ఒక రాజకీయ నాయకుడి విగ్రహం జోలికి వెళ్తే.. అట్టుడికిపోయే ఏపీలో దేవతా మూర్తుల విధ్వంసం కొనసాగుతున్నప్పటికీ.. ఎవరూ స్పందించట్లేదని, చేవలేని, చేతగాని, చచ్చిపోయిన హిందూ సమాజం ఏపీలో ఉందా అనే పరిస్థితులు దాపురించాయని అన్నారు
Tags:    

Similar News