పెళ్లిపేరుతో బాలికపై రేప్.. తప్పించుకున్న బాలిక
బాలికను కిడ్నాప్ చేసి బంధించి అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపింది. ఈ దారుణం విశాఖపట్నంలో వెలుగుచూసింది. ఆ కీచకుడి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది.
విశాఖ జిల్లాలోని కుంబిడిసింగి గ్రామానికి చెందిన ఓ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు కన్నేశాడు. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం బాలిక ఒంటరిగా ఉండగా గుర్తించిన యువకుడు బెదిరించి బైక్ పై ఎక్కించుకొని అరకు తీసుకెళ్లాడు.
అక్కడ ఓ లాడ్జీలో బాలికను బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం బాలికకు మాయమాటలు చెప్పి తాళి కట్టాడు.
అయితే అత్యాచారం జరిగినట్లుగా.. పెళ్లి చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పొద్దని బెదిరించాడు. అయినప్పటికీ బాలిక అతడిని నమ్మలేదు.
అనంతరం బాలిక తప్పించుకొని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఆమె తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు తెలుపడంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.