• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రంజాన్‌‌ ఉపాధి పై వైరస్...

రంజాన్‌‌ ఉపాధి పై వైరస్ దెబ్బ ..కళ తప్పిన పాతబస్తీ !

By - Tupaki Desk
Update: 2020-05-23 12:10 GMT
రంజాన్ ..ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ. రంజాన్ అంటే కేవలం ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ మాత్రమే కాదు, కొన్ని వేల కుటుంబాల కడుపు నింపే ఉపాధి. ఆ నెల రోజులు ఓల్డ్ సిటీలో ఉండే సందడి అంతాఇంతా కాదు. చార్మినార్ పరిసరాల్లోకి అడుగుపెట్టాలంటే వెహికల్ను కిలోమీటర్ దూరంలో పార్క్ చేయాల్సిందే. ఈ రంజాన్ కోసం ఎంతో మంది చిరువ్యాపారులు ఎదురుచూస్తుంటారు. ఈ రంజాన్ మాసంలో చార్మినార్ పరిసరాల్లోకి అడుగుపెట్టాలంటే కాలు దూరదు.

రంజాన్ నెలలో చార్మినార్ నుంచి మదీనా సర్కిల్ వరకు వచ్చిపోయే వెహికల్స్, జనాలతో రద్దీగా ఉండేవి. రోడ్డుకు రెండువైపులా షాపులు, వాటి ముందు తోపుడు బండ్ల కొనుగోళ్లతో కిటకిటలాడేవి. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, మసాలా దినుసులు, సేమియా, బట్టలు, బుర్ఖాలు, ఖురాన్లు, ఖురాన్ స్టాండ్స్, అత్తర్, సుర్మా, టోపీలు, కాస్మొటిక్స్, హౌస్ హోల్డింగ్స్ ఇలా అన్ని బిజినెస్‌‌లూ ఫుల్ గా నడిచేవి. కానీ, ఈ సారి మహమ్మారి కారణంగా కనీసం బయట కాలు పెట్టలేని పరిస్థితి.

లాక్ డౌన్ రిలాక్సేషన్స్ తో కొన్ని ఓపెన్ చేసినా చేతిలో పైసల్లేక ఎవరూ పెద్దగా షాపింగ్ చేయడం లేదు. దాంతో రంజాన్ సీజన్ బిజినెస్ పై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఏటా రంజాన్ నెల చివరి శుక్రవారం మక్కామసీదులో వేల మంది ప్రార్థనలు చేస్తుంటారు. ఈసారి లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సిబ్బంది ఐదుగురుకి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. ఎక్కువమంది ఇండ్లల్లో, కొద్దిమంది షాపుల్లో ప్రార్థనలు చేసుకున్నారు. ఇన్నేండ్లలో ఇలాంటి రంజాన్ చూడనే లేదంటున్నారు స్థానిక ముస్లింలు. కానీ, వైరస్ వల్ల మనుషులకు మనుషుల విలువ తెలిసింది అని, తొందరగా ఈ పరిస్థితి నుంచి కోలు కోవాలని ఆశిస్తున్నారు.
Tags:    
  • Ramdan 
  • old city 
  • shops 

Similar News

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

హైడ్రా రంగనాథ్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..

2026-11-05 06:52 GMT

Copyright @2026

Powered by Blink CMS