మా బాబాయి పైకి గుండాలలాగా వచ్చారు: ఎంపీ రామ్మోహన్

Update: 2020-06-12 13:30 GMT
తన సొంత బాబాయి.. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అరెస్టుపై శ్రీకాకుళం ఎంపీ రాంమోహన్ నాయుడు చాలా తీవ్రంగా స్పందించారు. తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏసీబీ అచ్చెన్నాయుడును అదుపులోకి తీసుకున్న తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

"ఈఎస్ఐ కుంభకోణం బహిర్గతం అయినప్పుడు, అచ్చెన్నాయుడు మొదట స్పందించి మీడియా ముందుకు వచ్చారని.. ఈ విషయంలో తనను దర్యాప్తు చేయాలనుకునే పోలీసులతో లేదా ఇతర అధికారులతో తాను పూర్తిగా సహకరిస్తానని ఆయన అన్నారని ”రాం మోహన్ వివరించారు.

అయినా కూడా వినకుండా దౌర్జన్యానికి పాల్పడడం దారుణమని ఎంపీ రాంమోహన్ తెలిపారు. “సుమారు 200 మంది పోలీసులతో ఏసీబీ అధికారులు వచ్చారు. కేవలం ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి ఇంత మంది పోలీసులు మరియు ఏసీబీ అధికారులు అవసరం ఏమిటి? అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడానికి ముందు నోటీసు ఎందుకు ఇవ్వలేదు. గుండాలులాగా వచ్చి అరెస్ట్ చేశారు. ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రిని అరెస్టు చేయడానికి అనుసరించాల్సిన విధానం ఏమీ పాటించలేదు. ”అని రాంమోహన్ నిప్పులు చెరిగారు.

"ఏపి సిఎం వైయస్ జగన్ అవినీతి - అసమర్థతను అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం అతనిని లక్ష్యంగా చేసుకుందని... నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఈ సమస్యను పెద్ద వేదికలపైకి తీసుకువెళతాను ” అని రామ్ మోహన్ అన్నారు.
Tags:    

Similar News